నీ అరచేతిలో చెక్కుకుంటివి

పాట రచయిత: శామ్యూల్ కర్మోజి
Lyricist: Samuel Karmoji

Telugu Lyrics


నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా
నీ నీడలో దాచుకుంటివి నను దేవా (2)
నీ రెక్కల చాటున దాగుకొని నిను కీర్తించెదను
నీవు చేసిన మేల్లను తలచుచునే ఇల జీవించెదను
నాకన్ని నేవే దేవా
నా బ్రతుకు నీకే ప్రభువా (2)

దీపముగా నీ వాక్యాన్నిచ్చి
తిన్నని త్రోవలో నన్ను నడిపి
నాకు ముందుగా నీవే నడచి
జారిపడకుండా కాపాడితివి
కొండ తేనెతో నన్ను తృప్తి పరచి
అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి
ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి – (2)         ||నాకన్ని||

ఆత్మ శక్తితో నన్ను అభిషేకించి
అంధకార శక్తులపై విజయాన్నిచ్చి
ఆశ్చర్య కార్యములెన్నో చేసి
శత్రువుల యెదుట భోజనమిచ్చి
ఎక్కలేని కొండలు ఎక్కించితివి
నా గిన్నె నిండి పార్ల చేసియితివి
నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి – (2)         ||నాకన్ని||

English Lyrics

Audio

1 comment

Leave a Reply

HOME