ఏమివ్వగలనయ్య నా యేసయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఏమివ్వగలనయ్య నా యేసయ్యా
నీవు చేసిన మేలులకై (2)
నిన్ను గూర్చి లోకమంత చాటనా
ఊపిరి ఉన్నంత వరకు పాడనా (2)         ||ఏమివ్వగలనయ్య||

గురి లేని నా జీవిత పయనంలో
దరి చేరి నిలచిన నా దేవుడవు
మతి లేక తిరుగుచున్న నన్ను
శృతి చేసి నిలిపిన నా దేవుడవు
ఎందుకింత నాపైన ఈ ప్రేమ
వర్ణించలేను నా యేసయ్యా (2)         ||నిన్ను గూర్చి||

ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ
నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా
నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా
నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా
ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా
నీ పాత్రగా నన్ను మలచినందుకు (2)         ||నిన్ను గూర్చి||

English Lyrics

Audio

3 comments

Leave a Reply

HOME