పాట రచయిత: గుంటూరు రాజా
Lyricist: Guntur Raja
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
నేనంటే నీకెందుకో ఈ ప్రేమా
నన్ను మరచి పొవెందుకు (2)
నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా
నన్ను విడిచిపోవెందుకు
కష్టాలలో నష్టాలలో
వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళలో కడగండ్లలో
వేదనలో శోధనలో
నా ప్రాణమైనావు నీవు
ప్రాణమా.. నా ప్రాణమా – (2) ||నేనంటే||
నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు
నిన్ను వీడిపోయినా – నన్ను వీడిపోలేవు (2)
ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4)
ఏ ఋణమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నేనంటే||
ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు
మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2)
ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4)
ఏ బలమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నేనంటే||
Elanti song malli malli enni sarlu vinna padina inka konivitidam ledhu chala Baga rasaru alage chala Baga padaru edanta devuni Krupa ….Amen….

ఇంతమంచి పాట పడే భాగ్యం యేసయ్య మీకు ఇచ్చారు SP గారు.విన్నవారెవరు జీవితంలో
మర్చిపోలేరు. థాంక్ యు యేసయ్యా
Ok super