యేసయ్యా నా ప్రాణ నాథా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నా ప్రాణ నాథా
రుజువాయే – నీ ప్రేమ – నా యెడల – కల్వరిలో – (2)
హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా నా యేసయ్యా (2)         ||యేసయ్యా||

నన్ను తలంచి ఏతెంచినవే – ఈ ధరకు
నా ఘోర స్థితి చూచి వెనుదీయలేదే – నీ ప్రేమ
నీ ఔన్నత్యం మహిమా ప్రభావం వీడితివి
కడు దీనుడవై నా పాప భారం మోసితివి
రిక్తుడవై వేలాడితివే
రక్తమే నాకై కార్చితివి          ||హల్లెలూయా||

పునరుత్తానుండా మృతి చెందలేదే – నీ ప్రేమ
యుగముల అంతము వరకు నాకై వేచినది – నీ ప్రేమ
ప్రత్యక్షపరచితివి ఈ పాపికి నీ ప్రేమ కల్వరిలో
శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నావని తెలిపితివి
అందదు నా మందికి అద్భుత ప్రేమ – (2)            ||హల్లెలూయా||

నీ అనాది ప్రేమ పునాదులపై నన్ను – నిర్మించితివే
నీ స్వకీయ సంపాద్యముగా నన్ను – చేసితివే
నను చెక్కుకున్నావు ప్రేమతో నీ అరచేతులందు
ఎంతని వర్ణింతు నీ ప్రేమ నా యేసు దేవా
చాలదు నా జీవిత కాలమంతా – (2)        ||హల్లెలూయా||

English Lyrics

Audio

1 comment

  1. Meaning of the song in english:

    Jesus My Dear
    Your love has been proved for me in Calvary
    Hallelujah My Jesus

    You though about me and came down to this earth
    Your Love didn’t step back after seeing my situation
    You have left your highness and power of your glory
    With utmost humbleness you took my sinful burden
    You hung (on the cross) as a poor man
    And shed your blood for me ||Hallelujah||

    You are resurrected and your love did not die
    Your love has waited for me forever
    You have shown your love for this sinner in Calvary
    You have shown that your are loving with an everlasting love
    My heart cannot understand your wonderful love ||Hallelujah||

    You have built me on the foundation of your eternal love
    You made me as your own earning
    You have graven me upon palms of your hands with love
    How much can I describe your love, my Jesus
    My life time would not be enough ||Hallelujah||

Leave a Reply

HOME