సరి చేయుమో దేవా

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


సరి చేయుమో దేవా
నన్ను బలపరచుమో ప్రభువా (2)
నీ ఆత్మతో నను అభిషేకించి
సరి చేయుమో దేవా (2)         ||సరి||

దూరమైతి నీ సన్నిధి విడచి
పారిపోతి నీ గాయము రేపి
లోకమునే స్నేహించితి నేను
పాపము మదిలో నింపుకున్నాను (2)
అది తప్పని తెలిసి తిరిగి వచ్చి
నీ సన్నిధిలో నే మోకరించి (2)
బ్రతిమాలుచున్నాను
నన్ను సరి చేయుమో దేవా (2)         ||సరి||

నింపుము నీ వాక్యము మదిలో
పెంచుము నను నీ పాలనలో
శోధనను గెలిచే ప్రతి మార్గం
ఇవ్వుము నాకు ప్రతి క్షణమందు (2)
నీ సన్నిధిలో ఒక దినమైనను
వేయి దినములకంటే బహుశ్రేష్టము (2)
అని తెలుసుకున్నాను
నన్ను సరి చేయుమో దేవా (2)         ||సరి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME