లేచినాడురా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


లేచినాడురా
సమాధి గెలచినాడురా (2) యేసు
లేతునని తా చెప్పినట్లు (2)
లేఖనములలో పలికినట్లు         ||లేచినాడురా||

భద్రముగా సమాధిపైన
పెద్ద రాతిని ఉంచిరి భటులు (2)
ముద్ర వేసి రాత్రి అంతా (2)
నిద్ర లేక కావలియుండ          ||లేచినాడురా||

పాప భారము లేదు మనకు
మరణ భయము లేదు మనకు (2)
నరక బాధ లేదు మనకు (2)
పరమ తండ్రి యేసు ప్రభువు         ||లేచినాడురా||

యేసునందే రక్షణ భాగ్యం
యేసునందే నిత్య జీవం (2)
యేసునందే ఆత్మ శాంతి (2)
యేసునందే మోక్ష భాగ్యం            ||లేచినాడురా||

పాపులకై వచ్చినాడు
పాపులను కరుణించినాడు (2)
పాపులను ప్రేమించినాడు (2)
ప్రాణ దానము చేసినాడు         ||లేచినాడురా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

Leave a Reply

HOME