ఊహకు అందని కార్యముల్

పాట రచయిత: సామి పచిగళ్ల
Lyricist: Samy Pachigalla

ఊహకు అందని కార్యముల్
ఊహించని రీతిలో నాకై చేసిన దేవా
ఊహకు అందని వేళలో
ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా
ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్
నీదు నామ గీతము నాదు జీవితాంతము
కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్      ||ఊహకు||

కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకు
ఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2)

అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెను
అద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యము
అసాధ్యమైనదేది నీకు లేనే లేదు
ఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2)       ||ఉత్సహించి||

బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగా
ఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగా
కనుపాప లాగ నన్ను కాచే దైవం నీవు
నడి సంద్రమైన నన్ను నడిపే తోడే నీవు (2)       ||ఉత్సహించి||

Oohaku Andani Kaaryamul
Oohinchani Reethilo Naakai Chesina Devaa
Oohaku Andani Velalo
Oohinchani Melulan Naakai Chesina Devaa
Uthsahinchi Paadedan Ullasinchi Chaatedan
Needu Naama Geethamu Naadu Jeevithaanthamu
Koniyaadedan Keerthinchedan Sthothrinchedan        ||Oohaku||

Kanabadavu Maa Kallaku – Mari Vinabadavu Maa Chevulaku
Oohalake Assalandavu – Prabhu Nee Kaaryamul (2)

Aduguvaati Kantenu – Oohinchu Vaati Kantenu
Adbhuthaalu Cheyagaa – Verevarikintha Saadhyamu
Asaadhyamainadedi Neeku Lene Ledu
Ila Neeku Minchi Naaku Daivamevarunnaaru (2)       ||Uthsahinchi||

Banda Nundi Neellanu – Ubikimpajesinaavugaa
Edaarilo Jala Dhaaralu – Pravahimpajesinaavugaa
Kanupaapa Laaga Nannu Kaache Daivam Neevu
Nadi Sandramaina Nannu Nadipe Thode Neevu (2)       ||Uthsahinchi||

 

FavoriteLoadingAdd to favorites

2 comments

Leave a Reply

%d bloggers like this: