బలపరచుము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

బలపరచుము స్థిరపరచుము
నా ప్రార్థనకు బదులీయము (2)
లోకాశల వైపు చూడకూండా
లోకస్థులకు జడవకుండా (2)
నీ కృపలో నేను జీవించుటకు       ||బలపరచుము||

నా మాటలలో నా పాటలలో
నీ సువార్తను ప్రకటించెదను (2)
నే నడచు దారి ఇరుకైననూ
నే నిలుచు చోటు లోతైననూ (2)
నే జడవక నిను కొలుతును       ||బలపరచుము||

ధ్యానింతును కీర్తింతును
నీ వాక్యమును అను నిత్యము (2)
అపవాది నన్ను శోధించినా
శ్రమలన్ని నాపై సంధించినా (2)
నే జడవక నిను కొలుతును     ||బలపరచుము||

English Lyrics

Audio

Leave a Reply

HOME