సుమధుర స్వరముల గానాలతో

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2)        ||సుమధుర||

ఎడారి త్రోవలో నే నడచినా – ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2)
నీవే నీవే నా ఆనందము
(నీవే) నీవే నా ఆధారము (2)        ||సుమధుర||

సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే నా జయగీతము
(నీవే) నీవే నా స్తుతిగీతము (2)        ||సుమధుర||

వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే నా అతిశయము
(నీకే) నీకే నా ఆరాధన (2)        ||సుమధుర||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

17 comments

Leave a Reply

HOME