Nee Vaakyame Shrama Kolimilo

నీ వాక్యమే శ్రమ కొలిమిలో
నను బ్రతికించుచున్నది (2)
నా బాధలో అది బహు నెమ్మది
కలిగించుచున్నది (2)       ||నీ వాక్యమే||

శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము
సంతోషమీయని యెడల (2)
బహు కాలము క్రితమే నేను – నశియించియుందునయ్యా
నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతున్ (2) ప్రభు       ||నీ వాక్యమే||

నీ శాసనములే ఆలోచన-
కర్తలై నన్ను నడుపుట వలన (2)
నా శత్రువుల మించిన జ్ఞానము – నాకిలను కలిగెనయ్యా
నీ ఆజ్ఞలను నేను తలదాల్తును (2) ప్రభు       ||నీ వాక్యమే||

వేలాది వెండి బంగారు నాణెముల
విస్తార ధన నిధి కన్నా (2)
నీ ధర్మశాస్త్రము యెంతో – విలువైన నిధి ప్రభువా
నీ ఆజ్ఞలను బట్టి నిను పొగడడం (2) ప్రభు       ||నీ వాక్యమే||

Nee Vaakyame Shrama Kolimilo
Nanu Brathikinchuchunnadi (2)
Naa Baadhalo Adi Bahu Nemmadi
Kaliginchuchunnadi (2)      ||Nee Vaakyame||

Shramayandu Naaku Nee Dharmashaashtramu
Santhoshameeyani Yedala (2)
Bahu Kaalamu Krithame Nenu – Nashiyinchiyundunayyaa
Nee Aagnalanu Batti Aanandinthun (2) Prabhu      ||Nee Vaakyame||

Nee Shaasanamule Aalochana-
Karthalai Nannu Naduputa Valana (2)
Naa Shathruvula Minchina Gnaanamu – Naakilanu Kaligenayyaa
Nee Aagnalanu Nenu Thaladaalthunu (2) Prabhu      ||Nee Vaakyame||

Velaadi Vendi Bangaaru Naanemula
Visthaara Dhana Nidhi Kannaa (2)
Nee Dharmashaasthrame Yentho – Viluvaina Nidhi Prabhuvaa
Nee Aagnalanu Batti Ninu Pogadedan (2) Prabhu      ||Nee Vaakyame||

Download Lyrics as: PPT

FavoriteLoadingAdd to favorites

Leave a Reply