శక్తి చేత కాదనెను

పాట రచయిత: ఇంజ దాస్ అబ్రహాం
Lyricist: Inja Das Abraham

Telugu Lyrics


శక్తి చేత కాదనెను
బలముతోనిది కాదనెను (2)
నా ఆత్మ ద్వారా దీని చేతునని
యెహోవ సెలవిచ్చెను (2)      ||శక్తి||

ఓ గొప్ప పర్వతమా
జెరుబ్బాబెలు నడ్డగింపను (2)
ఎంత మాత్రపు దానవు నీవనెను
చదును భూమిగా మారెదవు (2)      ||శక్తి||

ఓ ఇశ్రాయేలు విను
నీ భాగ్యమెంత గొప్పది (2)
యెహొవా రక్షించిన నిన్ను
బోలిన వారెవరు (2)      ||శక్తి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME