యేసు కోసమే జీవిద్దాం

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics


యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం
యేసుని పోలి నడిచే సాక్షులం
యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం
లోకములో యేసుని ప్రతినిధులం
శోధనలెదురైనా అవరోధములెన్నున్నా
విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు
ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా
లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా        ||యేసు కోసమే||

నిందారహితులుగా జీవించుట మన పిలుపు
నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు
యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము
లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే
ప్రేమయు సహనము యేసుని హృదయము
కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము       ||యేసు కోసమే||

యేసు స్వభామును ధరించిన వారలము
మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము
సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను
రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము
రాజులు జనములు యేసుని చూచెదరు
విశ్వాసులు విశ్వాసములో స్థిరముగ ఉన్నప్పుడు       ||యేసు కోసమే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME