కలువరి గిరి నుండి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కలువరి గిరి నుండి
ప్రవహించే ధార
ప్రభు యేసు రక్త ధార (2)
నిర్దోషమైన ధార
ప్రభు యేసు రక్త ధార (2)
ప్రభు యేసు రక్త ధార (2)       ||కలువరి||

నా పాపముకై నీ చేతులలో
మేకులను దిగగొట్టిరా (2)
భరియించినావా నా కొరకే దేవా
నన్నింతగా ప్రేమించితివా (2)     ||కలువరి||

నా తలంపులే నీ శిరస్సుకు
ముండ్ల కిరీటముగా మారినా (2)
మౌనము వహియించి సహియించినావా
నన్నింతగా ప్రేమించితివా (2)       ||కలువరి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఎంతో వింత

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఎంతో వింత యెంతో చింత
యేసునాధు మరణ మంత (2)
పంతము తో జేసి రంత
సొంత ప్రజలు స్వామి నంత (2)      ||ఎంతో||

పట్టి కట్టి నెట్టి కొట్టి
తిట్టి రేసు నాధు నకటా (2)
అట్టి శ్రమల నొంది పలుక
డాయె యేసు స్వామి నాడు (2)       ||ఎంతో||

మొయ్యలేని మ్రాను నొకటి
మోపి రేసు వీపు పైని (2)
మొయ్యలేక మ్రాని తోడ
మూర్చబోయే నేసు తండ్రి (2)      ||ఎంతో||

కొయ్యపై నేసయ్యన్ బెట్టి
కాలు సేతులలో జీలల్ (2)
కఠిను లంత గూడి కొట్టిరి
ఘోరముగ క్రీస్తేసున్ బట్టి (2)      ||ఎంతో||

దాహము గొన చేదు చిరక
ద్రావ నిడిరి ద్రోహు లకటా (2)
ధాత్రి ప్రజల బాధ కోర్చి
ధన్యుడా దివి కేగె నహహా (2)      ||ఎంతో||

బల్లెముతో బ్రక్కన్ బొడవన్
పారే నీరు రక్త మహహా (2)
ఏరై పారే యేసు రక్త
మెల్ల ప్రజల కెలమి నొసగు (2)      ||ఎంతో|

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

ఆరాధించెద

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఆరాధించెద నిను మది పొగడెద
నిరతము నిను స్తుతియించెదను (2)
మార్గము నీవే సత్యము నీవే (2)
జీవము నీవే నా ప్రభువా (2) ||ఆరాధించెద||

విస్తారంబగు వ్యాపకములలో
విడచితి నీ సహవాసమును (2)
సరిదిద్దితివి నా జీవితము (2)
నిను సేవింపగ నేర్పిన ప్రభువా (2) ||ఆరాధించెద||

నీ రక్తముతో నను కడిగితివి
పరిశుద్దునిగా జేసితివి (2)
నీ రక్షణకై స్తోత్రము చేయుచు (2)
నిత్యము నిన్ను కొనియాడెదను (2) ||ఆరాధించెద||

పెద్దలు పరిశుద్దులు ఘన దూతలు
నీ సన్నిధిలో నిలచిననూ (2)
లెక్కింపగజాలని జనమందున (2)
నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా (2) ||ఆరాధించెద||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME