అందమైన క్షణము

పాట రచయిత: జాషువా అరసవెల్లి
Lyricist: Joshua Arasavelli

Telugu Lyrics

అందమైన క్షణము ఆనందమయము
యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము
యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము (2)
బంగారు సొగసు కన్నా బహు అందగాడు (2)
బోళము సాంబ్రాణి కన్నా బహు సుగంధుడు

సంబరమే సంబరము శ్రీ యేసు జననము
సర్వ జగతికి మహా సంతోషము
సర్వ సృష్టికి ముందే దేవుడేర్పరిచిన
శాశ్వత జీవం ఈ ప్రభు యేసే
శాశ్వత జీవం ఈ ప్రభు యేసే

బలమైన యోధుడు దేవాది దేవుడు
దీన నరుడై మనకై పుట్టాడు
మన గాయములకు కట్టు కట్టి
మన బ్రతుకులను వెలుగుతో నింపిన
దైవతనయుని కొలువ రావా
సందేహించకు ఓ సోదరా
రక్షణ మార్గము కోరి రావా
సంశయమెందుకు ఓ సోదరా… ఓ సోదరీ…      ||సంబరమే||

పాప విమోచన నిత్య జీవం
సిలువలోనే మనకు సాధ్యం
సిలువ భారం తాను మోసి
మన దోషములను తుడిచేసాడు
సిలువ చెంతకు చేర రావా
జాగు ఎందుకు ఓ సోదరా
యేసు నామము నమ్మ రావా
జాగు ఎందుకు ఓ సోదరా… ఓ సోదరీ…      ||సంబరమే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పసి బాలుడై

పాట రచయిత: శ్రీనివాస్ బండారు
Lyricist: Srinivas Bandaru

Telugu Lyrics


పసి బాలుడై ప్రేమా రూపుడై – ఇమ్మానుయేలు దైవమై
నీతి తేజమై సత్య రూపమై – బలమైన నా దుర్గమా
దీనుడవై పరమును విడిచి – నా కొరకు దిగి వచ్చావు
నా రక్షణ కొరకై నీవు – నర రూపము ధరించినావు

రండి రండి నేడు బెత్లహేము పురముకు
రండి రండి ఆ యేసు రాజునొద్దకు
రండి రండి పరిశుద్ధాత్ముని యొద్దకు
రండి రండి నేడు ఉత్సహించి పాడుటకు         ||పసి బాలుడై||

యేసు రాజు పుట్టేనని హల్లేలూయా
గంతులు వేసి పాడుదమా హల్లేలూయా
నిజ రక్షకుడు అని హల్లేలూయా
ఆరాధించెదము హల్లేలూయా         ||రండి||

ఆశ్చర్యకరుడని యేసు హల్లేలూయా
పరిశుద్ధుడు అని పాడుదమా హల్లేలూయా
రాజులకు రాజు హల్లేలూయా
ఘనపరచి కీర్తింతున్ హల్లేలూయా         ||రండి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కన్నుల నిండుగ

పాట రచయిత: అనిల్ వేముల
Lyricist: Anil Vemula

Telugu Lyrics

కన్నుల నిండుగ – క్రిస్మస్ పండుగ
గుండెల నిండుగ – ఆనందముండుగ (2)
పరమ పురినుండే – పరిశుద్ధ దేవుడు
పుడమిలో పుట్టెగా – పాపుల బ్రోవగ
మహిమలోనుండే – మహిమాత్ముండు
మనుజుడాయెగా – మరణము నొందగా
రండి చేరి కొలిచెదం – రారండి కలసి పాడుదాం
రండి యేసుననుసరించుదాం – పదండి ప్రభుని చూపించుదాం (2)

సర్వసృష్టిని మాటతో చేసిన – సార్వభౌముడా నీకు సముడెవ్వరయ్యా
లోకపాపమంతయూ మోయవచ్చిన – దైవమానవా నీకు స్థలమే లేదయ్యా (2)
చీకటినుండి వెలుగునకు – మరణమునుండి జీవముకు (2)
నడిపింప వచ్చిన నజరేయుని – దాటింప వచ్చిన దయామయుని
ప్రేమించి వచ్చిన ప్రేమామయుని – క్షమియించ వచ్చిన క్షమాపూర్ణుని      ||రండి||

విశ్వమంతయూ వ్యాపించియున్న – సర్వవ్యాపి నీవులేని చోటే లేదయ్యా
అంతరంగమంతయూ ఎరిగియున్న – సర్వజ్ఞాని నీకు సాటే లేరయ్యా (2)
దాస్యము నుండి స్వాతంత్ర్యమును – శాపము నుండి విడుదలను (2)
ప్రకటింప వచ్చిన పుణ్యాత్ముని – రక్షింప వచ్చిన రక్షకుని
శాంతిచేయ వచ్చిన శాంతమూర్తిని – విడిపింప వచ్చిన విమోచకుని      ||రండి||

ఊహకందని త్రియేకమైయున్న – అద్వితీయుడా నీవే ఆత్మరూపివయ్యా
నిన్న నేడు రేపు ఏకరీతిగున్న – నిత్యనివాసి నీకు అంతమే లేదయ్యా (2)
సంకెళ్ళనుండి సంబరానికి – ఉగ్రతనుండి ఉదాత్తతకు (2)
తప్పింప వచ్చిన త్యాగమూర్తిని – కనికరింప వచ్చిన కరుణశీలుని
కృపజూపవచ్చిన కృపాకరుని – దాపుచేరనిచ్చిన దాక్షిణ్యపూర్ణుని      ||రండి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అందాల బాలుడు

పాట రచయిత: సాయారాం గట్టు
Lyrics: Sayaram Gattu

Telugu Lyrics

అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు (2)
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2)          ||అందాల||

భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)
గొల్లలము మేము కల్లలు ఎరుగము (2)
కళ్లారా జూసాము తేజోమయుని మోము (2)         ||రండయ్యో||

తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము (2)
దారి చూపే తార రారాజునే జేర (2)
మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2)         ||రండయ్యో||

తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2)
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2)
నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2)         ||రండయ్యో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

రారాజు పుట్టాడోయ్

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్
సూడంగ రారండోయ్ వేడంగ రారండోయ్ (2)
ఈ లోకమునకు రక్షకుడిగ పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే…
ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే, హోయ్…      ||రారాజు||

వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగ మిన్నుల పండగ
సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
పశువుల పాకలోన ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై…..      ||రారాజు||

మచ్చలేని ముత్యమల్లె పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లె కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా
సల్లంగా సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడెనంట
మరువని బంధమై…..      ||రారాజు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పరమ దైవమే

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics

యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించి
తిరిగి జన్మిస్తే
ఆయన కొరకు జీవించగలం
ఆయనను మనలో చూపించగలం

పరమ దైవమే మనుష్య రూపమై
ఉదయించెను నా కోసమే
అమర జీవమే నరుల కోసమై
దిగి వచ్చెను ఈ లోకమే
క్రీస్తు పుట్టెను – హల్లెలూయ
క్రీస్తు పుట్టెను – హల్లెలూయ
క్రీస్తు పుట్టెను – హల్లెలూయా (2)     ||పరమ దైవమే||

ఆకార రహితుడు ఆత్మ స్వరూపుడు
శరీరమును ధరించెను
సర్వాధికారుడు బలాఢ్య ధీరుడు
దీనత్వమును వరించెను
వైభవమును విడిచెను – దాసునిగను మారెను – (2)
దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా…      ||పరమ దైవమే||

అనాది వాక్యమే కృపా సమేతమై
ధరపై కాలు మోపెను
ఆ నీతి తేజమే నరావతారమై
శిశువై జననమాయెను
పాపి జతను కోరెను – రిక్తుడు తానాయెను (2)
భూలోకమును చేరెను – యేసు రాజుగా…      ||పరమ దైవమే||

నిత్యుడు తండ్రియే విమోచనార్ధమై
కుమారుడై జనించెను
సత్య స్వరూపియే రక్షణ ధ్యేయమై
రాజ్యమునే భరించెను
మధ్య గోడ కూల్చను – సంధిని సమకూర్చను – (2)
సఖ్యత నిలుప వచ్చెను – శాంతి దూతగా…      ||పరమ దైవమే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

క్రిస్మస్ ఆనందం వచ్చెను

పాట రచయిత: శ్రీనివాస్ బండారు
Lyricist: Srinivas Bandaru

Telugu Lyrics

క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి
దేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో (2)
ఆనందము మహదానందము
సంతోషము బహు సంతోషము (2)
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్
హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ (2)       ||క్రిస్మస్||

శోధనలేమైనా – బాధలు ఎన్నైనా
రండి క్రీస్తు నొద్దకు…
రక్షణ ఇచ్చెను – ప్రభువైన యేసు నాథుడు (2)      ||ఆనందము||

చింతయే నీకున్నా – శాంతియే కరువైనా
రండి క్రీస్తు నొద్దకు…
నెమ్మది ఇచ్చెను – ప్రియమైన దైవ తనయుడు (2)      ||ఆనందము||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

క్రీస్తేసు పుట్టెను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

క్రీస్తేసు పుట్టెను.. లోక రక్షకునిగా..
పశులపాక పావనమై.. పరవశించెనుగా…
పరవశించెనుగా…

క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగా
పశులపాక పావనమై పరవశించెనుగా
గొర్రెల కాపరులు సంతోషముతో
గంతులు వేసెను ఆనందముతో (2)
తూర్పు దిక్కున చుక్క వెలిసెను
లోక రక్షకుడు భువికి వచ్చెను (2)        ||క్రీస్తేసు||

హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్

ఆదివాక్యము శరీరధారియై లోకమందు సంచరించెను
చీకటిని చీల్చి జనులందరికి వెలుగును ప్రసాదించెను (2)
పాపములు తీసి పరిశుద్ధపరచి రక్షణ వరమందించే
ఆ యేసు రాజును స్తుతియించి ఘనపరచ రారండి (2)          ||తూర్పు దిక్కున||

సంతోషము సమాధానము కృపా కనికరము
మన జీవితములో ప్రవేశించెను బహుదీవెనకరము (2)
సంబరాలతో సంతోషాలతో వేడుకొన రారండి
బంగారము సాంబ్రాణి బోళము సమర్పించ రారండి (2)          ||తూర్పు దిక్కున||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

బేత్లెహేము పురములో

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics

బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి
ఊహలకు అందని అద్భుతము జరిగెను
లోక చరిత మార్చిన దైవకార్యము
కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను
అహహ్హ ఆశ్చర్యము ఓహొహ్హో ఆనందము
రారాజు యేసు క్రీస్తుని జననము
అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము
సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము

నన్నాన నా.. నా.. నా న నా న నా (4)
తనన్న నన్నాన నా – (3) తనననా (2)

ధన్యులం హీనులం మనము ధన్యులం
దైవమే మనల కోరి దరికి చేరెను
మనిషిగా మన మధ్య చేరె దీన జన్మతో
పశువుల తొట్టెలోన నిదుర చేసెను
అంటూ బాల యేసుని చూడ వచ్చి గొల్లలు
మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి      ||బేత్లెహేము ||

పుట్టెను యూదులకు రాజు పుట్టెను
వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి
నడిపెను ఆకశాన తార కనపడి
నిలిచెను యేసు ఉన్న చోటు తెలిపెను
తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు
యేసు చెంత మోకరించి కానుకలర్పించిరి      ||బేత్లెహేము ||

దొరికెను రక్షకుడు మనకు దొరికెను
తోడుగా ఇమ్మానుయేలు మనకు దొరికెను
దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను
యేసుని రూపమే మనకు సాక్ష్యము
యేసు జన్మ నింపెను లోకమంత సంబరం
నింపెను నిరీక్షణ కృపయు సమాధానము      ||బేత్లెహేము ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆహా హల్లెలూయా

పాట రచయిత: అనిల్ కుమార్ వేముల
Lyricist: Anil Kumar Vemula

Telugu Lyrics

తార జూపిన మార్గమదే… జ్ఞానులు చేరిన గమ్యమదే…
గొల్లలు గాంచిన స్థానమదే… లోక రక్షకుని గూర్చినదే…

ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది (2)
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా….

తార జూపిన మార్గమదే – జ్ఞానులు చేరిన గమ్యమదే
గొల్లలు గాంచిన స్థానమదే – లోక రక్షకుని గూర్చినదే (2)
ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది
పరిశుద్ధ ప్రవక్తలు పలికినది – పరలోక సైన్యము పాడినది (2)

ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా..    ||తార జూపిన||

దైవాజ్ఞను ధిక్కరించుటయే – పాపము ఓ సోదరా
ఆ పాపముతో లోకమంతా – నిండిపోయెను సోదరీ (2)
పాపమేమో మరణమును వెంట దెచ్చెగా
ఆ మరణమేమో నీకు నాకు సంక్రమించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరా
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరీ
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా.. ఆ.. ఆ.. ఆ..    ||ఆహా హల్లెలూయా||

దైవ చిత్తము నెరవేర్చుటకే – క్రీస్తేసు పరము వీడగా
పాప రుణమును చెల్లించుటకై – పావనుడే పుడమి చేరెగా (2)
సిలువలో సాతాను తల చితకద్రొక్కెగా
రుధిరమిచ్చి నిన్ను నన్ను శుద్ధి చేయగా
బంధకములు తెంపబడెగా ఓ సోదరా
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా
బంధకములు తెంపబడెగా ఓ సోదరీ
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా.. ఆ.. ఆ.. ఆ..    ||ఆహా హల్లెలూయా||

దైవ వాక్యము బోధించుటకు – పావనాత్మ పంపబడెగా
లోక పాపము ఒప్పించుటయే – ఆదరణకర్త కార్యమాయెగా (2)
అంధకారమంత బాపి వెలుగు నిచ్చుగా
అనుదినము నిన్ను నన్ను నడిపించునుగా
సందేహమేల సమయమిదే ఓ సోదరా
నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా
సందేహమేల సమయమిదే ఓ సోదరీ
నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా… ఆ.. ఆ.. ఆ..    ||ఆహా హల్లెలూయా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME