కలువరిగిరిలో సిలువధారియై

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కలువరిగిరిలో సిలువధారియై
వ్రేలాడితివా నా యేసయ్యా (2)

అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2)
నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2)            ||కలువరిగిరిలో||

దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2)
ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి
నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా (2)                ||కలువరిగిరిలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

సిలువలో సాగింది యాత్ర

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర (2)

ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే             ||సిలువలో||

పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో (2)
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2)       ||ఇది ఎవరి||

వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)
గేలి చేసినారు పరిహాసమాడినారు (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2)       ||ఇది ఎవరి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

సిలువలో బలి అయిన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు (2)

ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి (2)
కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే (2)       ||సిలువలో||

నా అతిక్రయములకై నలుగ గొట్టబడి (2)
నా దోషముల నీవు ప్రియముగను మోసితివి (2)      ||సిలువలో||

మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత (2)
సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా (2)             ||సిలువలో||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME