అమ్మ కన్న మిన్న

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా
నాన్న కన్న మిన్న ఓ యేసయ్యా (2)
నీ ప్రేమ కొదువ లేనిది
ఆ.. ఆ.. నీ కృప అంతము కానిది (2)

ఓ తల్లి తన బిడ్డను మరచునా
వారైనా మరచినా నేను మరువను
అని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా – (2)        ||నీ ప్రేమ||

English Lyrics

Audio

నాకున్న చిన్ని ఆశ

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


చిట్టి పొట్టి పాపను నేను
చిన్నారి పాపను నేను (2)

యేసయ్యా నిన్ను చూడాలని
నాకున్న చిన్ని ఆశ
యేసయ్యా నిన్ను చేరాలని
నాకున్న చిన్ని ఆశ         ||చిట్టి||

నీ సన్నిధిలోనే ఉండాలని
నాకున్న చిన్ని ఆశ
నీ సన్నిధిలో పాట పాడాలని
నాకున్న చిన్ని ఆశ         ||చిట్టి||

నీకై నేను జీవించాలని
నాకున్న చిన్ని ఆశ
నిన్నే నేను సేవించాలని
నాకున్న చిన్ని ఆశ      ||చిట్టి||

English Lyrics

Audio

Chords

నాలాంటి చిన్నలంటే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం
మాలాంటి వారిదే పరలోక రాజ్యం (2)

మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే
పరలోక రాజ్యమని యేసు చెప్పెను (2)       ||నాలాంటి||

నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని
ముద్దాడి ముచ్చటించి దీవించెను (2)       ||నాలాంటి||

English Lyrics

Audio

విధేయత కలిగి జీవించుటకు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


విధేయత కలిగి జీవించుటకు
జీవమిచ్చాడు యేసు జీవమిచ్చాడు
ప్రతి ఉదయము యేసయ్యతో మాటలాడుటకు
ప్రార్ధన నేర్పాడు యేసు ప్రార్ధన నేర్పాడు
యేసయ్యతో ఉంటే సంతోషమే
యేసయ్యతో ఉంటే ఆనందమే
సాతానుతో ఉంటే కష్టాలు
సాతానుతో ఉంటే నష్టాలూ

అందుకని
ప్రతి రోజు మనం, దేవుణ్ణి ప్రార్ధించి
దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండి
మన సొంత ఇల్లైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యి
మన అమ్మ నాన్నలను కూడా పరలోక రాజ్యానికి తీసుకు వెళదామా

సరే ఇప్పుడు ఏం చేయాలంటే
ప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లి
యేసయ్యను ఆరాధించెదము
ఏం చెయ్యాలంటే
ప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లి
యేసయ్యను ఆరాధించెదము

బుడి బుడి బుడి అడుగులతో
చిట్టి చిట్టి చిట్టి చేతులెత్తి (2)
యేసయ్యను ఆరాధించెదము

యేసయ్యా ఈ రోజు నుండి
నీ వాక్యమనే మార్గములో నడిపించు యేసయ్యా

English Lyrics

Audio

తెల్లారింది వేళ

పాట రచయిత: శామ్యూల్ కర్మోజి
Lyricist: Samuel Karmoji

Telugu Lyrics


అన్నయ్య… తెల్లారింది లేరా..
తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా
మనమంతా ఆయన సృష్టే రా
పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా
వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2)

అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ
యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా (2)
వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను
రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా (2)
మరచిపోవునా               ||తెల్లారింది||

చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూ
విత్తలేదు కోయలేదని – కృంగిపోవునా (2)
వాటికన్ని కూర్చువాడు – నీ తండ్రి యేసేనని
నీకు ఏమి తక్కువ కాదని – నీకు తెలియునా (2)
నీకు తెలియునా               ||తెల్లారింది||

English Lyrics

Audio

ఇసుక మీద ఇల్లు కట్టకు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది
బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది

ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది (2)
వాన కురిసి వరద వస్తే
గాలి తోడై విసిరి కొడితే (2)
మాట వినని వాని ఇల్లు కూలిపోయెను
లోబడని వాని ఇల్లు కూలిపోయెను
వాని సొగసైన ఇల్లు కూలిపోయెను (2)

బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది (2)
వాన కురిసి వరద వస్తే
గాలి తోడై విసిరి కొడితే (2)
మాట వినిన వాని ఇల్లు నీటుగుండెను
లోబడిన వాని ఇల్లు నీటుగుండెను
వాని సొగసైన ఇల్లు నిలిచియుండెను (2)

జోరు వాన హోరు గాలి వరద పోటు
ఆ ఇంట ముంగిట తెల్లబోయెగా (2)
బండ మీద ఇల్లు కట్టి
సాటి ఏదని చాటి చెప్పి (2)
బండ అయిన యేసు మీద
నీ బ్రతుకు ఇంటిని కట్టుకోవయ్యా
బండ అయిన యేసు మీద
నీ బ్రతుకు ఇంటిని కట్టుకోవమ్మా
చావు వద్ద తీర్పు వద్ద
కూలిపోని కాలిపోని (2)
నిత్య జీవం పొందరావయ్యా
సజీవుడైన యేసు దేవుని స్వీకరించయ్యా
నిత్య జీవం పొందరావమ్మా
సజీవుడైన యేసు దేవుని స్వీకరించమ్మా

ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది
బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది (5)

English Lyrics

Audio

మేడి చెట్టు పైకి ఎవ్వరెక్కారు

పాట రచయిత: పిళ్ళా వెంకటరత్నం
Lyricist: Pillaa Venkatarathnam

Telugu Lyrics


మేడి చెట్టు పైకి ఎవ్వరెక్కారు
మేడి చెట్టు పైకి ఎందుకెక్కారు (2)
మేడి చెట్టు పైకి జక్కయ్యెక్కాడు
యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు (2)

మేడి చెట్టు కింద ఎవ్వరాగారు
చెట్టు దిగిన జక్కయ్య ఏమి చేసాడు (2)
మేడి చెట్టు క్రింద రక్షకుడాగాడు
యేసును జక్కయ్యింట చేర్చుకున్నాడు (2)

ఓ.. ఓ.. ఓ తమ్ముడా
ఓ.. ఓ.. ఓ చెల్లెలా (2)
యేసుని నీవు చేర్చుకుంటావా
నీ హృదయములో స్థానమిస్తావా (2)

ఓ.. ఓ.. ఓ తమ్ముడా
ఓ.. ఓ.. ఓ చెల్లెలా (2)

English Lyrics

Audio

చెప్పలేను బాబోయ్

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని
చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో ||చెప్పలేను||

ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు (2)
ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు (2) బాబోయ్ ||చెప్పలేను||

కానానులో పెళ్లి విందులో (2)
వాటర్ ని వైన్ గా మార్చివేసాడు (2) బాబోయ్ ||చెప్పలేను||

సమాధిలో శవాన్ని చూచి (2)
కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు (2) బాబోయ్ ||చెప్పలేను||

English Lyrics

Audio

 

చిట్టి పొట్టి పాపను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా
చిన్న గొరియపిల్లను నేను యేసయ్యా (2)

పాపమంటే తెలియదు కాని యేసయ్యా
పాప లోకంలో నున్నానట యేసయ్యా (2) ||చిట్టి||

జీవమంటే తెలియదు కాని యేసయ్యా
నిత్య జీవం నీవేనట యేసయ్యా (2) ||చిట్టి||

English Lyrics

Audio

నా చిన్ని హృదయమందు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు
నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు (2)

పాపము చేయను మోసము చేయను
ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను (2) ||నా చిన్ని||

బడికి వెళ్లెద గుడికి వెళ్లెద
మంచి చేసెద దేవుని మహిమ పరచెద (2) ||నా చిన్ని||

English Lyrics

Audio

HOME