ఆశ్రయమా ఆధారమా

పాట రచయిత: కే వై రత్నం
Lyricist: K Y Ratnam

Telugu Lyrics

ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా
నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా (2)
నిను విడచి నేనుండలేను
క్షణామైనా నే బ్రతుకలేను (2)       ||ఆశ్రయమా||

కష్ట కాలములు నన్ను కృంగదీసినను
అరణ్య రోదనలు నన్ను ఆవరించినను (2)
నా వెంటే నీవుండినావు
నీ కృపను చూపించావు (2)       ||ఆశ్రయమా||

భక్తిహీనులు నాపై పొర్లిపడినను
శత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను (2)
నా వెంటే నీవుండినావు
కాపాడి రక్షించినావు (2)       ||ఆశ్రయమా||

మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను
బంధు స్నేహితులు నన్ను బాధపెట్టినను (2)
నా వెంటే నీవుండినావు
దయచూపి దీవించినావు (2)       ||ఆశ్రయమా||

English Lyrics

Audio

నాకు చాలిన దేవుడ నీవు

పాట రచయిత: 
Lyricist:

Telugu Lyrics


నాకు చాలిన దేవుడ నీవు
నా కోసమే మరణించావు (2)
నా శ్రమలలో నా ఆధారమా
నను ఎడబాయని నా దైవమా (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను
ఏ రీతిగా నిను స్తుతియించగలను (2)       ||నాకు చాలిన||

వధకు సిద్ధమైన గొరియపిల్ల వోలె
మౌనివై నా పాప శిక్షణోర్చినావు (2)
అన్యాయపు తీర్పుతో దోషిగ నిను చేసినా (2)
చిరునవ్వుతో సిలువనే భరించినావయ్యా (2)        ||ఏమిచ్చి||

ఎండిన భూమిలో లేత మొక్క వోలె
నా శ్రమలను భరియించి నలుగగొట్టబడితివా (2)
సూదంటి రాళ్ళలో గొల్గొతా దారిలో (2)
నడవలేక సుడి వడి కూలినావయ్యా (2)        ||ఏమిచ్చి||

English Lyrics

Audio

స్తోత్రము స్తుతి చెల్లింతుము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా
యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా (2)
నీవే మార్గం నీవే జీవం
నీవే సత్యం నీవే సర్వం (2)           ||స్తోత్రము||

మరణమైననూ ఎర్ర సంద్రమైననూ
నీ తోడు నాకుండ భయము లేదుగా
శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా
బలమైన కోట నీవేగా (2)
నా దుర్గమా నా శైలమా
నా అతిశయమా ఆనందమా (2)       ||నీవే||

హింసలైననూ పలు నిందలైననూ
నీ చల్లని రెక్కలే నాకాశ్రయం
చీకటైననూ అగాధమైననూ
నీ క్షమా కిరణమే వెలుగు మార్గము (2)
నీతి సూర్యుడా నా పోషకుడా
నా వైద్యుడా మంచి కాపరి (2)       ||నీవే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME