యవ్వనులారా మీరు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


యవ్వనులారా మీరు – ప్రభు నొద్దకు రండి
సమృద్ధియైన జీవము నొందుటకు – (2)
ఆహాహా హల్లెలూయా – (6)

ప్రభు యేసు మన కొరకు
సిలువపై బలియాయెను (2)
మీ పాపమునొప్పుకొనిన (2)
క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2)         ||ఆహాహా||

ప్రభు యేసుని స్వరమును వినుచు
ఆ ప్రభుని వెంబడించిన (2)
కాపాడును దుష్టుని నుండి (2)
నడిపించు నిన్ను అంతము వరకు (2)         ||ఆహాహా||

చేపట్టి జీవ వాక్యము
జ్యోతుల వలె ఇహమందున (2)
ప్రభు కొరకు ప్రకాశించుచు (2)
ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను (2)         ||ఆహాహా||

నిజ ఆహారా పానీయం
ప్రభు యేసు క్రీస్తే కాగా (2)
ఆయననే తిని త్రాగుచూ (2)
ఆ జీవముతో మనము జీవించెదము (2)         ||ఆహాహా||

మృతి నొందిన మనమందరము
పై వాటినే వెంటాడెదం (2)
మన జీవము వృద్ధి నొందుచూ (2)
ప్రభు యేసుని మహిమను పొందెదము (2)        ||యవ్వనులారా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పరలోకమందున్నమా తండ్రీ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


పరలోకమందున్నమా తండ్రీ
నీ నామము – పరిశుద్ధ పరచబడుగాక (2)
నీ రాజ్యము వచ్చుగాక (3)
ఆహా ఆహ ఆహాహాహా – ఆహా ఆహ ఆహాహాహా (2)

నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు
భూమియందును నెరవేరునుగాక (2)
మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము (2)

మా ఋణస్తులను మేము క్షమించియున్న ప్రకారము
మా ఋణములు క్షమించుము (2)
మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము (2)

ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు
నిరంతరము నీవైయున్నావు తండ్రీ… ఆమెన్

English Lyrics

Audio

అత్యున్నత సింహాసనముపై

పాట రచయిత: అంశుమతి మేరి
Lyricist: Amshumathi Mary

Telugu Lyrics

అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతును నిన్నే (2)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్

ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం (2)            ||ఆహాహా||

కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావు
నా రక్షణకర్త స్తోత్రం (2)                    ||ఆహాహా||

స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలు ఆలకించువాడా
మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2)     ||ఆహాహా||

మృత్యుంజయుడా స్తోత్రం
మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘ వాహనుడా స్తోత్రం (2)             ||ఆహాహా||

ఆమెన్ అనువాడా స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం (2)                 ||ఆహాహా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME