ఆకాశమందు నీవుండగా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఆకాశమందు నీవుండగా
నేను ఎవరికి భయపడను
నీవీ లోకములో నాకుండగా
నేను దేనికి భయపడను (2)

శత్రుసమూహము నన్ను చుట్టినా
సైతనుడు సంహరింపజూసినా (2)
నా సహవాసిగా నీవుండగా
నేను ఎవరికి భయపడను (2)        ||ఆకాశమందు||

వ్యాధులు కరువులు శోధనలు
బాధలు దుఃఖము వేదనలు (2)
మరణము మ్రింగగ కాంక్షించినా
నేను దేనికి భయపడను (2)        ||ఆకాశమందు||

పడిపోయిన వెనుకంజ వేయక
పశ్చాత్తాపము పడి అడుగు (2)
నిను క్షమియించును నీ ప్రభువే
నీవు ఎవరికి భయపడకు (2)        ||ఆకాశమందు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా

పాట రచయిత: యేసుదాస్
Lyricist: Yesudas

Telugu Lyrics


స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా (2)
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు (2)        ||స్తుతి||

నా శత్రువులు నను తరుముచుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2)
నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి విడిపించినావు
కాపాడినావు (2)         ||స్తుతి||

నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభూ (2)
నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో
నీ సంఘములో (2)         ||స్తుతి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME