ఆకాశము నీ సింహాసనం

పాట రచయిత: వై సత్యవర్ధన్ రావు
Lyricist: Y Sathyavardhan Rao

Telugu Lyrics


ఆకాశము నీ సింహాసనం
భూలోకము నీ పాద పీఠము
మహోన్నతుడా – మహా ఘనుడా
నీకే నా స్తోత్రము – నీకే నా స్తోత్రము

స్తుతులకు పాత్రుడా యేసయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా
జీవాధిపతివి నీవయ్యా
జీవము గల మా యేసయ్యా

పాపుల రక్షకా యేసయ్యా
రక్షించుటకు పుట్టావయ్యా
నీ సిలువే నా మరణమును
తప్పించి రక్షించెనయ్యా

అద్భుతకారుడా మహనీయా
ఆశ్చర్యకరుడా ఓ ఘనుడా
దయగల మా ప్రభు యేసయ్యా
కృపగల మా ప్రభు నీవయ్యా

రానైయున్న యేసయ్యా
బూరధ్వనితో నీవేనయ్యా
మధ్యాకాశంలో విందయ్యా
ఎంతో ధన్యత మాకయ్యా

English Lyrics

Audio

Download Lyrics as: PPT

భూపునాది మునుపే

పాట రచయిత: జార్జ్ సాంబత్తిని
Lyricist: George Sambathini

Telugu Lyrics


భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే
ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు
కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే
ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు
నూతనాకాశము.. నూతన లోకము…
నూతనెరుషలేము వచ్చును
దేవుడే మనతో.. గుడారమై యుండును…
మనమంతా మరలా పాడెదము     ||భూపునాది||

జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే
నిత్యము మనలో ఉందును (2)
తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు
మనతో ఏకమై యుండును     ||భూపునాది||

వేదన బాధయు – కన్నీరు దుఃఖము
ఇంకెక్కడా ఉండే ఉండవు (2)
సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవు
దేవుడే వెలుగై యుండును      ||భూపునాది||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీ కృప ఆకాశము కన్నా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా
నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా

నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు
ఎల్లకాలం తోడు నీవే
నమ్మదగిన యేసయ్యా – కృతజ్ఞతా స్తుతులు నీకే – (2)
కృతజ్ఞతా స్తుతులు నీకే

పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిది
పరమ తండ్రి నీ ప్రేమ నిస్స్వార్ధ్యమైనది        ||నీ ప్రేమ||

పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనది
పరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును         ||నీ ప్రేమ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME