యేసు యేసు యేసు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు యేసు యేసు నిన్ను చూడాలి (2)
చూడాలి నిత్యం చూడాలి (2)

అగ్ని స్థంభమా నిన్ను చూడాలి (2)
మేఘ స్థంభమా నిన్ను చూడాలి (2)        ||యేసు||

అగ్ని జ్వాల నేత్రుడా నిన్ను చూడాలి (2)
అపరంజి పాదములను చూడాలి (2) నీ..        ||యేసు||

దహించు అగ్ని నిన్ను చూడాలి (2)
పాపపు పెదవులు దహించు నిన్ను చూడాలి (2) నా..        ||యేసు||

మండుచున్న అగ్ని పొద నిన్ను చూడాలి (2)
పాదాలకున్న మలినము పోవాలి (2) నా..        ||యేసు||

దీప వృక్షమా నిన్ను చూడాలి (2)
నీతి సూర్యుడా నిన్ను చూడాలి (2)        ||యేసు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసయ్యా నా హృదయాభిలాష

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా (2)

పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై
నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు (2)
పూజనీయుడా నీతి సూర్యుడా
నిత్యము నా కనుల మెదలుచున్నవాడా        ||యేసయ్యా||

ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా (2)
విజయశీలుడా పరిశుద్ధాత్ముడా
నిత్యము నాలోనే నిలచియున్నవాడా         ||యేసయ్యా||

English Lyrics

Audio

అగ్ని మండించు

పాట రచయిత: ఫ్రెడ్డీ పాల్
Lyricist: Freddy Paul

Telugu Lyrics

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2)

అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)       ||అగ్ని||

అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)       ||అగ్ని||

అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2)       ||అగ్ని||

ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2)       ||అగ్ని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME