అందరు మెచ్చిన అందాల తార

పాట రచయిత: గుడేటి పురుషోత్తం బాబు
Lyricist: Gudeti Purushotham Babu

Telugu Lyrics

అందరు మెచ్చిన అందాల తార
అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)
క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)       ||అందరు||

సృష్టికర్తయే మరియ తనయుడై
పశుల పాకలో పరుండినాడు (2)
నీతి జీవితం నీవు కోరగా
నీకై రక్షణ తెచ్చినాడు (2)
నీకై రక్షణ తెచ్చినాడు          ||క్రిస్మస్||

ఇంటిని విడిచి తిరిగిన నాకై
ఎదురు చూపులే చూచినాడు (2)
తప్పును తెలిసి తిరిగి రాగా
క్షమియించి కృప చూపినాడు (2)
ఎన్నో వరములు ఇచ్చినాడు         ||క్రిస్మస్||

పాత దినములు క్రొత్తవి చేసి
నీలో జీవము నింపుతాడు (2)
కటిక చీకటే వేకువ కాగా
అంబరమందు సంబరమాయే (2)
హృదయమునందు హాయి నేడు         ||క్రిస్మస్||

English Lyrics

Audio

యేసు క్రీస్తు పుట్టెను నేడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో
మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2)
ఇది పండుగ – క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2)       ||యేసు క్రీస్తు||

పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2)
కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2)        ||ఇది పండుగ||

సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా (2)
నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2)        ||ఇది పండుగ||

శరీర ధారిగా – కృపగల దేవునిగా (2)
పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను (2)        ||ఇది పండుగ||

English Lyrics

Audio

అందాల ఉద్యానవనమా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

అందాల ఉద్యానవనమా
ఓ క్రైస్తవ సంఘమా (2)
పుష్పించలేక ఫలియింపలేక (2)
మోడై మిగిలావ నీవు (2) ||అందాల||

ప్రభు ప్రేమలో బాగు చేసి
శ్రేష్టమౌ ద్రాక్షాగ నాటాడుగా (2)
కాచావు నీవు కారు ద్రాక్షాలు (2)
యోచించు ఇది న్యాయమేనా (2)   ||అందాల||

ప్రభు యేసులో నీవు నిలచి
పరిశుద్ధాత్మతో నీవు పయనించుమా (2)
పెరిగావు నీవు ఫలియింపలేక (2)
యోచించు ఇది న్యాయమేనా (2)    ||అందాల||

ఆకలిగొని నీవైపు చూడ
ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)
ఇకనైన నీవు నిజమైన ఫలముల్ (2)
ప్రభు కొరకై ఫలియింపలేవా (2)   ||అందాల||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అందాలతార

పాట రచయిత: మాసిలామని
Lyricist: Masilamani

Telugu Lyrics

అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని               ||అందాల తార||

విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున
విశ్వాలనేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్         ||అందాల తార||

యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ యెదలో కృంగితి
యేసయ్యతార యెప్పటివోలె యెదురాయె త్రోవలో
ఎంతో యబ్బుర పడుచు విస్మయ మొందుచు యేగితి స్వామి కడకు      ||అందాల తార||

ప్రభు జన్మ స్ధలము పాకయేగాని పరలోక సౌధమే
బాలుని జూడ జీవితమంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగ ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్థన           ||అందాల తార||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME