నీవు లేని క్షణమైనా

పాట రచయిత: ఆర్ లాజరస్
Lyricist: R Lazarus

Telugu Lyrics

నీవు లేని క్షణమైనా ఊహించలేను
నీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2)
నీవే నా కాపరి – నీవే నా ఊపిరి
నీవే నా సర్వము యేసయ్య
నీతోనే జీవితం – నేనే నీకంకితం
గైకొనుమో నన్ను ఓ దేవా…          ||నీవు లేని||

శ్రమలెన్నో వచ్చినా – శోధనలే బిగిసినా
నను ధైర్యపరిచె నీ వాక్యం
సంద్రాలే పొంగినా – అలలే ఎగసినా
నను మునగనీయక లేవనెత్తిన (2)
నీవే నా కండగా – నాతో నీవుండగా
భయమన్నదే నాకు లేదూ
సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా
వందనము నీకే ఓ దేవా…          ||నీవు లేని||

శత్రువులే లేచినా – అగ్ని ఆవరించినా
అవి నన్ను కాల్చజాలవుగా
దుష్టులే వచ్చినా – సింహాలై గర్జించినా
నాకేమాత్రం హాని చేయవుగా (2)
వెన్నుతట్టి బలపరచిన – చేయిపట్టి నడిపించిన
వేదనలే తొలగించిన యేసయ్యా
సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా
వందనము నీకే ఓ దేవా…          ||నీవు లేని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

విలువైనది నీ జీవితం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


విలువైనది నీ జీవితం
యేసయ్యకే అది అంకితం (2)

ఆ దేవ దేవుని స్వరూపంలో
నిను చేసుకున్న ప్రేమ
తన రూపులో నిను చూడాలని
నిను మలచుకున్న ప్రేమ
ఈ మట్టి ముద్దలో – తన ఊపిరే ఊది
నిను నిర్మించిన ఆ గొప్ప ప్రేమ
తన కంటి రెప్పలా – నిను కాచేటి
క్షణమైన నిన్ను ఎడబాయని ప్రేమా…         ||విలువైనది||

ప్రతి అవసరాన్ని తీర్చే
నాన్న మన ముందరుండగా
అనుక్షణమున నీ చేయి విడువక
ఆయనీతో నడిచెగా
ఎటువంటి బాధైనా – ఏలాంటి శ్రమ అయినా
నిను విడిపించే దేవుడుండగా
అసాధ్యమేముంది – నా యేసయ్యకు
సాటి ఏముంది ఆ గొప్ప ప్రేమకు          ||విలువైనది||

English Lyrics

Audio

అంకితం ప్రభూ నా జీవితం

పాట రచయిత: జ్యోతి రాజు
Lyricist: Jyothi Raju

Telugu Lyrics

అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)
నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా (2)

మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా
నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా
నీ కృపలో బహుగా ఫలించుటకు
ఫలింపని వారికి ప్రకటించుటకు (2)
అంగీకరించుము నా సమర్పణ            ||అంకితం||

కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా
చీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువా
నీ సన్నిధిలో ప్రకాశించుటకు
అంధకార ఛాయలను తొలగించుటకు (2)
అంగీకరించుము నా సమర్పణ         ||అంకితం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ప్రియ యేసు నాథ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు
నీదు పొలములో కూలివానిగా
కావాలి నేను నీదు తోటకు కావలివానిగా
అంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమే
అంకితం ఈ జీవితం విద్యార్ధి లోకానికే

స్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవను
మెచ్చునేసు మహిమతో వచ్చు వేల (2)
మరువకు నా ప్రాణమా
నీ ప్రయాస వ్యర్ధము కాదు (2)     ||ప్రియ యేసు||

ఏక భావము సేవ భారము
యేసు మనసుతో సాగిపోదును (2)
విసుగక విడువక
కష్టించి పని చేసెదన్ (2)          ||ప్రియ యేసు||

English Lyrics

Audio

 

 

ఈ తరం యువతరం

పాట రచయిత: సతీష్ కుమార్
Lyricist: Satish Kumar

Telugu Lyrics

ఈ తరం యువతరం
ప్రభు యేసుకే అంకితం
నా బలం యవ్వనం
ప్రభు యేసుకే సొంతము
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు వార్త చాటుదాం
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం||

సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా
ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా
దేవుని సేవ వ్యాపారమాయే
ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ||

నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా
యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా
యేసయ్య రాకడ సామీపమాయే
ఆ వార్త చాటను వేగిర రావే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ||

English Lyrics

Audio

అడిగినది కొంతే అయినా

Telugu Lyrics

పాట రచయిత: క్రాంతి చేపూరి

అడిగినది కొంతే అయినా
పొందినది ఎంతో దేవా
ప్రతిగా ఏమివ్వగలనయా
నిను స్తుతియించే హృదయము తప్ప
నా జీవితం నీకే అంకితమయ్యా – (4)            ||అడిగినది||

ఊహించలేని వివరింపజాలని
నీ కార్యములు ఆశ్చర్యమే
యోచించినా నా వర్ణనకందని
నీ కృపా కనికరములు అత్యున్నతమే
తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా
యుగయుగములకు నీకే ఘనతా మహిమా
సతతం నిను నే కొనియాడెదను
సకలం నీ నామముకే స్తోత్రము తగును            ||అడిగినది||

క్షణ భంగురం నా క్షయ జీవితం
కాచావయ్యా నను నీ రెక్కల నీడ
ఏ యోగ్యత లేని అల్పురాల నన్ను
హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ
నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య
నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య
నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా
ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా                 ||అడిగినది||

మహిమోన్నతుడా నను మరువని విభుడా
ప్రణుతించెదను నిన్నే నిరతం
నిష్కలంకుడా నిర్మలాత్ముడా
ప్రకటించెదను నీ పావన చరితం
నా అతిశయము నీవే నా యేసయ్యా
నా ఆధారము నీవే నా మెస్సయ్యా
నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా
ఈ దీన సేవను చేకొనుమయ్యా          ||అడిగినది||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME