వధియింపబడిన గొర్రెపిల్లా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


హోలీ హోలీ… హోలీ హోలీ… (2)
హోలీ హోలీ హోలీ హోలీ
హోలీ… యు ఆర్ హోలీ (2)

వధియింపబడిన గొర్రెపిల్లా – సింహాసనాసీనుడా (2)
నీ రక్తమిచ్చి… ప్రాణమిచ్చి… మమ్ములను కొన్నావే
ప్రతి జనములో… నీ ప్రజలను… నీ యాజక రాజ్యము చేసావే
రక్షణ జ్ఞానము స్తోత్రము – శక్తియు ఐశ్వర్యము నీదే
రాజ్యము బలము ప్రభావము – మహిమ ఘనత నీదే
అర్హుడా.. యోగ్యుడా.. కృతజ్ఞతకు పాత్రుడా (2)          ||వధియింప||

అన్నిటికి పైనున్నావు – అందరిని చూస్తున్నావు
అధికారం ఇచ్చే మహా దేవుడవు
ఆకాశ భూములయందు ఈ సృష్టి సర్వమునందు
నీ చిత్తము జరిగించే మహారాజు నువ్వు
నీ రాజ్యము నిలుచును నిరతము
నీదేగా సర్వాధికారము
నీవెవ్వరికి ఇత్తువో వారిదే ఔను భూ రాజ్యము
మహోన్నతుడు యేసుని శుద్ధులదే ఈ అధికారము              ||రక్షణ||

దృశ్యములు అదృశ్యములు – ఆకాశ భూజల జీవులు
అన్నియును నీ యందే సృజియింపబడెన్
సింహాసన ప్రభుత్వములు – ప్రధానులు అధికారములు
అందరును నీ శాసనముకు లోబడును
నీ మాటతో ఏలెడి ప్రభుడవు
నీవొకడివే సృష్టికి కర్తవు
పరలోక పెద్దలందరు తమ కిరీటము తీసి నిన్ను కొలుతురే
భూ రాజులు నివాసులు తమ మహిమనంతా తెచ్చి పూజింతురే              ||రక్షణ||

దావీదు చిగురువు నువ్వు – యూదా స్తుతి సింహము నువ్వు
దావీదు తాళపు చెవి యజమానుడవు
నువ్వు తలుపును మూసావంటే – తెరిచేటి వారే లేరు
నువ్వు తెరిచిన తలుపును మూసే వారెవరు
నీ భుజములపై రాజ్య భారము
నీదేగా నిత్య సింహాసనము
భూరాజ్యములన్నింటిని కూలగొట్టి నిలుచును నీ రాజ్యము
నిను విశ్వసించు వారికే చెందుతుంది నీ సత్య రాజ్యము              ||రక్షణ||

సెరాపులు కెరూబులచే – పరిశుద్ధుడు పరిశుద్ధుడని
తరతరములు కొనియాడబడే శుద్ధుడవు
నీ స్తుతిని ప్రచురము చేయ – మమ్మును నిర్మించావయ్యా
మా ఆరాధనకు నీవే యోగ్యుడవు
నీ నామము బహు పూజనీయము
ప్రతి నామమునకు పై నామము
ప్రతి వాని మోకాలును ప్రభు యేసు నామమందున వంగును
ప్రతి నాలుక యేసుడే అద్వితీయ ప్రభువని ఒప్పును              ||రక్షణ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

స్తుతులకు పాత్రుడా (ఆరాధన)

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా
నిరతము నిలచువాడా – నీకే స్తోత్రము
త్వరలో రానున్న – మా మెస్సయ్యా
మరణము గెలచిన మా విమోచకుడా
ఆరాధన చేసెదం
అజేయుడా మా ప్రభూ
అద్వితీయ సత్య దేవుడా
నీవే మా రాజువు (2)            ||స్తుతులకు||

నీతియు సమాధానము
ఆనందము నీ రాజ్యము
నీ సిలువయే మాకు శక్తి
నీ సిలువయే మాకు బలము (2)
ఆత్మానుసారమైన
నవీన జీవితమునిచ్చితివి
ఆత్మ నియమము ద్వారా
పాప మరణము నుండి విడిపించితివి (2)            ||ఆరాధన||

నీవే మా నిరీక్షణకర్తవు
నమ్మదగినవాడవు
నీలోనే మా అతిశయము
మమ్ము విలువ పెట్టి కొన్నావు (2)
ప్రభువా మీతో మేము
ఏకాత్మయై యున్నాము
అక్షయమగు కిరీటము
ధరియింపజేయువాడవు నీవే (2)            ||ఆరాధన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

స్తుతులకు పాత్రుడా (అన్ని వేళలో)

పాట రచయిత: సి హెచ్ కుమార్ ప్రకాష్
Lyricist: Ch Kumar Prakash

Telugu Lyrics


స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా
మహిమ నాథుడా – యేసు నీకే వందనం (2)
అన్ని వేళలో ఎన్నో మేళ్లతో
మమ్ము బ్రోచిన యేసు నీకే వందనం (2)
వందనం వందనం యేసు నీకే వందనం (2)

నమ్మదగిన వాడా – యేసు నీకే వందనం
నీతిమంతుడా – యేసు నీకే వందనం (2)
ఆశ్రయ దుర్గమా – నా విమోచకా (2)         ||వందనం||

ప్రేమాపూర్ణుడా – యేసు నీకే వందనం
ప్రాణ నాథుడా – యేసు నీకే వందనం (2)
పాపరహితుడా – పావన నాథుడా (2)         ||వందనం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మహిమకు పాత్రుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా
మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము (2)
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు (2)

స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం
నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము (2)        ||మహోన్నతుడా||

అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా
మా కరములను జోడించి మేము మహిమ పరచెదం (2)        ||మహోన్నతుడా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME