పేతురు వలె నేను

పాట రచయిత: జాస్పర్ కునపో
Lyricist: Jasper Kunapo

Telugu Lyrics

ఆరాధ్యుడవు నీవే ప్రభు
ఆనందముతో ఆరాధింతును (2)
అత్యున్నత ప్రేమను కనుపరచినావు
నిత్యము నిను కొనియాడి కీర్తింతును (2)        ||ఆరాధ్యుడవు||

పేతురు వలె నేను ప్రభునకు దూరముగా
పనులతో జనులతో జతబడి పరుగెత్తగా (2)
ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం
గలిలయ తీరమున నన్ను గమనించితివా (2)        ||ఆరాధ్యుడవు||

ప్రభురాకడ నెరిగి జలజీవరాసులు
తీరము చేరిరి కర్తను తేరి చూడగా (2)
పరుగెత్తెను పలు చేపలు ప్రభు పనికై సమకూడి
సంతోషముతో ఒడ్డున గంతులేసెను (2)        ||ఆరాధ్యుడవు||

నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి
మీనముతో భోజనము సమకూర్చితివా (2)
ఆచేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు
అద్వితీయ దేవుడవు నీవే ప్రభు (2)        ||ఆరాధ్యుడవు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

స్తుతులపై ఆసీనుడా

పాట రచయిత: బన్నీ సుదర్శన్
Lyricist: Bunny Sudarshan

Telugu Lyrics

స్తుతులపై ఆసీనుడా
అత్యున్నత నా దేవుడా (2)
నీ ప్రేమలో నీ ప్రేమలో
నను నేను మరిచాను నీ ప్రేమలో
నీ నీడలో నీ జాడలో
మైమరచిపోయాను నేను ||స్తుతులపై||

నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు
నీవు పొందిన గాయాలకు బదులు (2)
బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలు
వెండినడుగలేదు నీవు
విరిగి నలిగి – కరిగి వెలిగే
హృదయాన్నే కోరావు నీవు (2)
ఓ మాట సెలవియ్యి దేవా
నీ పాద ధూళిని కానా ప్రభువా
నీ పాదం స్పర్శించగానే
నా సంతోషానికి హద్దుండునా ||స్తుతులపై||

నీవు లేచిన పునరుథ్తానా దినము మొదలు
మా బ్రతుకులో విజయము మొదలు (2)
మరణం అనేటి ముల్లును విరచి
తిరిగి లేచావు నీవు
చీకటి నిండిన మాదు బ్రతుకులో
వెలుగులు నింపావు నీవు (2)
నీకోసం ఏదైనా దేవా
నే వెచ్చింప సంసిద్ధమయ్యా
ఆఖరికి నా ప్రాణమైనా
చిందులు వేస్తూ అర్పిస్తా ||స్తుతులపై||

English Lyrics

Audio

మా గొప్ప దేవా

పాట రచయిత: పవన్ కుమార్
Lyricist: Pavan Kumar

Telugu Lyrics


మా గొప్ప దేవా – మము కరుణించి
అత్యున్నత స్థానములో నను నిలిపావు
యోగ్యుడనే కాను ఆ ప్రేమకు
వెల కట్టలేను ఆ ప్రేమకు
ఆరాధించెదను… నా పూర్ణ హృదయముతో
నిన్నే కీర్తింతును – నా జీవితమంతా (2)

నెమ్మదే లేని బ్రతుకులో – పాపపు బంధకాలలో
చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు (2)
పాపంలో నుండి నను విమోచించుటకు
ఆ ఘోర సిలువలోన మరణించావు
దాస్యములోనుండి పడి ఉన్న నన్ను
నీ కుమారునిగా రక్షించావు           ||మా గొప్ప||

మార్పులేని బ్రతుకులో మలినమైన మనస్సుతో
నే తూలనాడి దూషించింది నిన్నేనేగా (2)
ఆ స్థితిలో కూడా నను ప్రేమించే గొప్ప
హృదయం నీదే యేసయ్యా
నాలాంటి ఘోరమైన పాపిని కూడా
క్షమియించి ప్రేమించింది నీవేనయ్యా           ||మా గొప్ప||

English Lyrics

Audio

అత్యున్నతమైనది యేసు నామం

పాట రచయిత: షూలమ్మీతీ ఫిన్నీ పచిగళ్ల
Lyricist: Shulammite Finny Pachigalla

Telugu Lyrics

అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం
అత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామం
ఉన్నత నామం – సుందర నామం
ఉన్నత నామం – శ్రీ యేసు నామం
అన్ని నామములకు పై నామం – పై నామం – పై నామం
యేసు నామం – యేసు నామం (2)

ప్రతి మోకాలు యేసు నామంలో నేల వంగును
ప్రతి నాలుక యేసే దైవమని అంగీకరించును (2)
పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా
పరలోక దీవెనలు పొందగ చేరుము
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ          ||అత్యున్నత||

పరిశుద్ధుడైన యేసు నామంలో సాతాను పారిపోవున్
మృతిని గెల్చిన యేసు నామంలో స్వస్థత దొరుకును (2)
పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా
పరలోక దీవెనలు పొందగ చేరుము
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ          ||అత్యున్నత||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అత్యున్నత సింహాసనముపై (యేసన్న)

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా
సాగిలపడి నమస్కారము చేసేదా (2)

ప్రతి వసంతము నీ దయా కిరీటమే
ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో (2)         ||అత్యున్నత||

పరిమలించునే నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)
పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో (2)           ||అత్యున్నత||

పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)
యెహోవ నిన్నే మహిమ పరచెద
స్తుతి గీతాలతో – స్తుతి గీతాలతో (2)      ||అత్యున్నత||

English Lyrics

Audio

అత్యున్నత సింహాసనముపై

పాట రచయిత: అంశుమతి మేరి
Lyricist: Amshumathi Mary

Telugu Lyrics

అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతును నిన్నే (2)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్

ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం (2)            ||ఆహాహా||

కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావు
నా రక్షణకర్త స్తోత్రం (2)                    ||ఆహాహా||

స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలు ఆలకించువాడా
మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2)     ||ఆహాహా||

మృత్యుంజయుడా స్తోత్రం
మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘ వాహనుడా స్తోత్రం (2)             ||ఆహాహా||

ఆమెన్ అనువాడా స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం (2)                 ||ఆహాహా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME