ఈ స్తుతి నీకే

పాట రచయిత: తిమోతి పరిశపోగు
Lyricist: Timothy Parishapogu

Telugu Lyrics

ఈ స్తుతి నీకే మా యేసు దేవా
(మా) మనసారా నిన్నే సేవింతుము – (2)
పరలోక దూతాలి స్తోత్రాలతోనే`
మా స్తోత్ర గానాలు గైకొనుమా (2)        ||ఈ స్తుతి||

జగతికి పునాది నీవని
మాలోన ఊపిరి నీదేనని (2)
మా పోషకుడవు నీవేనని
మా కాపరివి నీవేనని (2)
మా హృదయాలలో ఉండాలని
నీ సాక్షిగా మేము బ్రతకాలని         ||ఈ స్తుతి||

మనసారా నీ దరి చేరగా
మాకెంతో సంతోషమాయెగా (2)
హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో
మా హృది ప్రవహించే సెలయేరులా (2)
నీ మధుర ప్రేమను చాటాలని
నీ జీవ బాటలో నడవాలని         ||ఈ స్తుతి||

English Lyrics

Audio

నీ జల్దరు వృక్షపు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

నీ జల్దరు వృక్షపు నీడలలో
నేనానంద భరితుడనైతిని (2)
బలు రక్కసి వృక్షపు గాయములు (2)
ప్రేమా హస్తములతో తాకు ప్రభు (2)     ||నీ జల్దరు||

నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలచితివి (2)
నీ శిరము వానకు తడిచినను (2)
నను రక్షించుటకు వేచితివి (2)    ||నీ జల్దరు||

నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి (2)
ద్రాక్షా రస ధారల కన్న మరి (2)
నీ ప్రేమే ఎంతో అతి మధురం (2)     ||నీ జల్దరు||

ఓ ప్రియుడా నా అతి సుందరుడా
దవళ వర్ణుడా నాకతి ప్రియుడా (2)
వ్యసనా క్రాంతుడుగా మార్చబడి (2)
నీ సొగసును నాకు నొసగితివి (2)      ||నీ జల్దరు||

English Lyrics

Audio

Chords

HOME