కొడవలిని చేత పట్టి

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics


కొడవలిని చేత పట్టి కోత కోయుము
తెల్లబారిన పొలములన్నియు (2)
నశియించు ఆత్మల భారము కలిగి
ఆగక సాగుమా ప్రభు సేవలో     ||కొడవలిని||

సర్వ సృష్టికి సువార్త ప్రకటన
ప్రభువు మనకిచ్చ్చిన భారమే కదా (2)
ఎన్నడూ దున్నని భూములను చూడు (2)
కన్న తండ్రి యేసుని కాడిని మోయు (2)       ||కొడవలిని||

పిలిచిన వాడు నమ్మదగినవాడు
విడువడు నిన్ను ఎడబాయడు (2)
అరచేతులతో నిన్ను చెక్కుకున్నవాడు (2)
అనుక్షణము నిన్ను కాయుచున్నవాడు (2)       ||కొడవలిని||

English Lyrics

Audio

యేసూ నన్ ప్రేమించితివి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసూ నన్ ప్రేమించితివి
ఆశ్రయము లేనప్పుడు – నీ శరణు వేడగానే
నా పాప భారము తొలగే (2)         ||యేసూ||

నే తలచలేదెప్పుడు – నా అంతమేమౌనని (2)
నా పాపములచే నేను నిన్ను విసిగించితిని               ||యేసూ||

నిన్ను నే గాంచగానే – నా జీవితము మారెను (2)
నీయందు గృచ్చబడి నిన్నంగీకరించితి            ||యేసూ||

రక్షణ దొరికే నాకు – రక్తముతో నన్ను కడిగి (2)
క్రయముగా నీ చెంతకు రక్షకా తెచ్చితివి          ||యేసూ||

English Lyrics

Audio

రండి రండి యేసుని యొద్దకు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
ప్రయాసపడి భారము మోయువారలు
ప్రభుని చెంతకు పరుగిడి వేగమే

యేసుని పిలుపు వినియు నింక – యోచింపరేల
అవనిలో అగచాట్ల పాలైన
అబ్బదు శాంతి ఆత్మకు నిలలో         ||రండి||

కరువు రణము మరణము చూచి – కలుగదు మారుమనస్సు
ప్రవచనములు సంపూర్ణములాయెను
యూదులు తిరిగి వచ్చుచున్నారు        ||రండి||

ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చె గదా
సిలువను రక్తము చిందించియును
బలియాయెను యా ఘనుడు మనకై       ||రండి||

యేసుని నామమునందె పరమ – నివాసము దొరకును
ముక్తిని పాప విమోచనమును
శక్తిమంతుడు యేసే యిచ్చును      ||రండి||

నేనే మార్గము నేనే సత్యము – నేనే జీవమును
నేను గాకింకెవరు లేరని
యెంచి చెప్పిన యేసుని వద్దకు     ||రండి||

English Lyrics

Audio

Chords

ఆశ్చర్య కార్యముల్

పాట రచయిత: స్వర్ణ గీత కొమానపల్లి
Lyricist: Swarna Geetha Komanapalli

Telugu Lyrics

ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2)
అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము
నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2)        ||ఆశ్చర్య||

రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా
యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను
జాలరుల మదిలో ఆనందమే
యేసుతో పనిలో ఆశ్చర్యమే (2)
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2)        ||ఆశ్చర్య||

కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం
యేసు మాట నిలుచును తరతరాలు
తండ్రిలా పోషించి దీవించును
తల్లిలా ఆదరించి ప్రేమించును (2)
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2)        ||ఆశ్చర్య||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME