మనసులొకటాయే భువిలో

పాట రచయిత: మైఖెల్ కళ్యాణపు
Lyricist: Michael Kalyanapu

Telugu Lyrics


మనసులొకటాయే భువిలో
ఇరువురొకటాయే హృదిలో (2)
మనసు పరవశమై మధుర లాహిరిలో (2)
మనసులోని భావాలు
ఉరకలు వేసే ఈ వేళా        ||మనసులొకటాయే||

ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోట
దేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా (2)
ఈ మధురమైన శుభవేళ (2)
ఒకరికొకరు తోడు నీడగా
సాగే ఈ తరుణం        ||మనసులొకటాయే||

అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై
జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా (2)
ఘన యేసుని దివ్య ఆశీస్సు (2)
జీవితాంతం నిండుగ మెండుగ
నీతో నిలిచే ఈ తరుణం        ||మనసులొకటాయే||

English Lyrics

Audio

ఎవరున్నారయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప
ఏమున్నదయ్యా భువిలో నీవు లేక (2)
నా యేసయ్యా హల్లెలూయా
నా యేసయ్యా హల్లెలూయా (2)

నా ఆశ్రయం నీవే – నా ఆశయం నీవే (2)
నా సర్వము యేసు నీవేగా (2)         ||ఎవరున్నారయ్యా||

ఈ భువికి దీపం నీవే – నా హృదిలో వెలుగు నీవే (2)
అన్నింటిని వెలిగించే దీపం నీవే (2)         ||ఎవరున్నారయ్యా||

English Lyrics

Audio

యేసు వంటి సుందరుడు

పాట రచయిత: ఎం ఎస్ శాంతవర్ధన్
Lyricist: M S Shanthavardhan

Telugu Lyrics


యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భువిలో
ఎన్నడు నే చూడలేదు ఇక చూడబోనుగా
పరిపూర్ణ సుందరుడు భువిలోన జీవితమునకు
నీవే చాలు వేరేవ్వరు నాదు ప్రియ యేసయ్య
మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను
పాడు మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను

పరిపూర్ణ సుందరుడు రక్షించుకొంటివి నన్ను
సంపూర్ణముగా నన్ను నీకు అర్పించెదను     ||యేసు||

యెరుషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి
నీపై నున్న ప్రేమను తొలగించబూనిరి         ||యేసు||

దినదినం నీపై నాప్రేమ పొంగుచున్నది
యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము       ||యేసు||

English Lyrics

Audio

ఆనందమానందమే

పాట రచయిత: జె దేవానంద్ కుమార్
Lyricist: J Devanand Kumar

Telugu Lyrics

ఆనందమానందమే
ఈ భువిలో యేసయ్య నీ జననము (2)
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికి మహిమ ప్రభావము
భూమి మీద తనకిష్టులకు
సమాధానము కలుగును గాక
హల్లెలూయా           ||ఆనంద||

తన ప్రజలను వారి పాపమునుండి రక్షించుట
కొరకై యేసు భువికి దిగి వచ్చెను
తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకు
దేవుని జ్ఞానమై వచ్చెను          ||సర్వోన్నత||

మరణ ఛాయలు చీకటిలోను కూర్చున్నవారికి
యేసు అరుణోదయమిచ్చెను
పాప శాపము నుండి ప్రజలకు విడుదలనిచ్చుటకు
క్రీస్తు నర రూపము దాల్చెను       ||సర్వోన్నత||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME