నా మట్టుకైతే

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics


నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైతే నాకు లాభము
నా ప్రభువా యేసయ్యా (4)          ||నా మట్టుకైతే||

నీ కృప నాకు చాలును ఇలలో
నీవు లేని బ్రతుకే శూన్యము నాలో (2)
నా ప్రభువా యేసయ్యా (4)          ||నా మట్టుకైతే||

నీవే నా గొప్ప కాపరివి
విడువను నను ఎడబాయనంటివి (2)
నా ప్రభువా యేసయ్యా (4)          ||నా మట్టుకైతే||

English Lyrics

Audio

బ్రతుకుట నీ కోసమే

పాట రచయిత: ఆడమ్ బెన్నీ
Lyricist: Adam Benny

Telugu Lyrics


బ్రతుకుట నీ కోసమే
మరణమైతే నాకిక మేలు (2)
సిలువ వేయబడినానయ్యా (2)
నీవే నాలో జీవించుమయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)

ఏ క్షణమైనా ఏ దినమైనా
నీ కొరకే నే జీవించెద (2)
శ్రమలైనా శోధనలైనా
ఇరుకులైనా ఇబ్బందులైనా (2)
ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా (2)
సేవలో సాగెదనయ్యా..       ||యేసయ్యా||

లోకములోని నిందలు నాపై
రాళ్ళై రువ్విన రంపాలై కోసిన (2)
రాజులైనా అధిపతులైనా
ఉన్నవి అయినా రాబోవువైనా (2)
నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపవయ్యా (2)
ఏవి ఎడబాపవయ్యా..          ||యేసయ్య||

English Lyrics

Audio

HOME