నీవే నీవే నన్ను పిలిచిన

పాట రచయిత: షారోన్
Lyricist: Sharon

Telugu Lyrics

నీవే నీవే.. నన్ను పిలిచిన స్వరము
నన్ను కలిసిన వరము (2)
స్తుతి గాన సంపద నిన్ను చేరాలని
నా దీన మనస్సు నీవే చూడాలని
ప్రయాసతో ప్రయాణమైతిని       ||నీవే||

నీ తోడు నాకుండగా – ఏ దిగులు నాకుండదు
నీ చెలిమి నాకుండగా – కన్నీరే నాకుండదు (2)
ప్రతి కీడు తప్పించు – పరిశుద్ధ గ్రంథం
నా కొరకే పంపావయ్యా
ఏ చోటనైనా – ఏ పల్లెనైనా
నీ పలుకే బంగారమాయెనయా        ||నీవే||

నోవాహును నడిపిన – నావికుడు నీవేనయ్యా
సంద్రాన్ని చల్లార్చిన – ఆ శక్తి నీదేనయ్యా (2)
దావీదు ప్రార్ధన – ఆ యోబు వేదన
కనిపెట్టి చూసావయ్యా
నా దుఃఖ భారం – నా శాప భారం
నీలోనే కరగాలయ్యా          ||నీవే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నాకున్న చిన్ని ఆశ

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


చిట్టి పొట్టి పాపను నేను
చిన్నారి పాపను నేను (2)

యేసయ్యా నిన్ను చూడాలని
నాకున్న చిన్ని ఆశ
యేసయ్యా నిన్ను చేరాలని
నాకున్న చిన్ని ఆశ         ||చిట్టి||

నీ సన్నిధిలోనే ఉండాలని
నాకున్న చిన్ని ఆశ
నీ సన్నిధిలో పాట పాడాలని
నాకున్న చిన్ని ఆశ         ||చిట్టి||

నీకై నేను జీవించాలని
నాకున్న చిన్ని ఆశ
నిన్నే నేను సేవించాలని
నాకున్న చిన్ని ఆశ      ||చిట్టి||

English Lyrics

Audio

Chords

ఇదే నా హృదయ వాంఛన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఇదే నా హృదయ వాంఛన
నీవే నా హృదయ స్పందన (2)
నిన్ను చూడాలని – నిన్ను చేరాలని (2)
నా బ్రతుకు నీలో నే సాగని        ||ఇదే నా||

నీ యందు నిలిచి ఫలియించాలని
నీ అడుగు జాడలోనే నడవాలని (2)
ఈ లోక ఆశలన్ని విడవాలని (2)
నీ సువార్తను ఇలలో చాటాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – (2)
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2)      ||ఇదే నా||

ప్రతి వారు నీవైపు తిరగాలని
ప్రతి వారి మోకాలు వంగాలని (2)
ప్రతి నాలుక నిన్నే స్తుతియించాలని (2)
ప్రతి ఆత్మ ప్రార్ధనలో నిండాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – (2)
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2)      ||ఇదే నా||

ప్రతి చోట నీ పాట పాడాలని
ప్రతి చోట నీ సువార్త చేరాలని (2)
ప్రతి వారికి రక్షణ కావాలని (2)
ప్రతి వారు నీ సన్నిధి చేరాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – (2)
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2)      ||ఇదే నా||

English Lyrics

Audio

నాలోని ఆశ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని
నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని
దేవా.. యేసయ్యా నిన్ను చూడాలని
దేవా… యేసయ్యా నిన్ను చేరాలని

జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూ
జీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2)
మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ
మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్

శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృప
వేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ చేయి (2)
ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా
తరతరాలు మారినా మారని దేవుడా         ||జీసస్||

విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యా
మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా (2)
తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెద
నా బ్రతుకు దినములన్ని నిన్ను పూజింతును          ||జీసస్||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా ప్రాణప్రియుడా నా యేసురాజా

పాట రచయిత: విక్టర్ రాంపోగు
Lyricist: Victor Rampogu

Telugu Lyrics


నా ప్రాణప్రియుడా నా యేసురాజా
నా యేలినవాడా నా స్నేహితుడా (2)
నిన్ను చేరాలని నీతో ఉండాలని (2)
నిన్ను వలచానయ్యా – నీవు నా సొంతం (2)         ||నా ప్రాణ||

నీ స్వరము నే వింటిని – ప్రాణం సొమ్మసిల్లెనేసయ్యా
నీ ముఖము నే చూచితిని – మనసానందమాయేనా (2)
నీ ప్రేమను రుచి చూచితి
నీ వశమైతిని యేసయ్యా (2)         ||నా ప్రాణ||

నీ చేయి నే పట్టుకొని – నీతో నడవాలనుంది యేసయ్యా
నీ భుజమును నేనానుకొని – నీతో బ్రతకాలనుంది యేసయ్యా (2)
నిన్ను హత్తుకొని
నీ ఒడిలోన నిదురించాలని ఉందయ్యా (2)         ||నా ప్రాణ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసయ్యా నిన్ను చూడాలని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ (2)
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు
ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా (2)         ||యేసయ్యా||

అందరు ఉన్నారని అందరు నావారని (2)
తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని (2)
చివరికి ఒంటరి నేనైతిని
నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా        ||యేసయ్యా||

అంధకారములో అంధుడ నేనైతిని (2)
నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా (2)
నాకొసగుమా నజరేయుడా
నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా
నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా        ||యేసయ్యా||

English Lyrics

Audio

 

 

గమ్యం చేరాలని

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesley

Telugu Lyrics

గమ్యం చేరాలని నీతో ఉండాలని
పగలూ రేయి పరవశించాలని
ఈ నింగి నేలా కనుమరుగైనా
శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2)       ||గమ్యం చేరాలని||

భువి అంతా తిరిగి జగమంతా నడచి
నీ జ్ఞానముకు స్పందించాలని
నాకున్నవన్ని సమస్తం వెచ్చించి
నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో         ||సాగిపోతున్నాను||

అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా
శిరమును వంచి సహించాలని
వేదన బాధలు గుండెను పిండినా
నీదు సిలువనే మోయాలని
నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని       ||సాగిపోతున్నాను||

English Lyrics

Audio

బ్రతకాలని ఉన్నా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా
నిలవాలని ఉన్నా నిలవలేకున్నా (2)
చూడాలని ఉన్నా చూడలేకున్నా
చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
బ్రతికించుమో యేసయ్యా
దరి చేర్చుమో నన్నయ్యా (2)            ||బ్రతకాలని||

కాపరి లేని గొర్రెనైతి
కాటికి నే చేరువైతి
కావలి లేని తోటనైతి
కారడవిగా నే మారితి
గూడు చెదరిన గువ్వనైతి
గుండె పగిలిన ఎకాకినైతి
గుండె దిగులుగా ఉందయ్యా
గూడు చేర్చుమో యేసయ్యా (2)         ||బ్రతకాలని||

నా ఆశలే అడియాశలై
అడుగంటెనే నా జీవితం
శోధనల సుడివడిలో
తొట్రిల్లెనే నా పయనం
చుక్కాని లేని నావనైతి
గమ్యం తెలియక అల్లాడుచుంటి
గురి చేర్చుమో యేసయ్యా
గుండె గుడిలో నీవుండయ్యా (2)         ||బ్రతకాలని||

English Lyrics

Audio

 

 

HOME