దేవుడు దేహమును

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics


దేవుడు దేహమును పొందిన దినము
మనిషిగా మారి ఇల చేరిన క్షణము (2)
తార వెలిగెను – దూత పాడెను
పరలోకనికి మార్గము వెలిసెను (2)
స్తుతుల గానములు పాడి పరవశించెదము
యేసు నామమునే చాటి మహిమ పరిచెదము (2)

దూత పలికెను భయము వలదని
తెలిపే వార్తను యేసే క్రీస్తని (2)
చీకటి తొలగెను రారాజుకు భయపడి
లోకము వెలిగెను మరణము చెరవిడి (2)
క్రీస్తు పుట్టెనని తెలిపి సంతోషించెదము
నిత్య జీవమునే చాటి ఘనత పొందెదము (2)       ||దేవుడు||

సృష్టి కారుడు అల్పుడాయెను
అది శాపము తీయ వచ్చెను (2)
పాపము ఎరుగని మనిషిగా బ్రతికెను
మానవ జాతికి మార్గమై నిలిచెను (2)
నమ్మి ఒప్పినను చాలు తొలగు పాపములు
పరము చేరుటకు మనకు కలుగు దీవెనలు (2)       ||దేవుడు||

English Lyrics

Audio

నను చేరిన నీ ప్రేమ

పాట రచయిత: మేఘన మేడపాటి
Lyricist: Meghana Medapati

Telugu Lyrics


నను చేరిన నీ ప్రేమ
తొలగించని నీ ప్రేమ
జీవితానికి చాలిన – యేసు నీ ప్రేమ
నిను నేను విసిగించినా
నిను విడచి పారిపోయినా
నిను నేను హింసించినా – వీడని ప్రేమ
నన్ను ఓర్చి దరికి చేర్చి
స్నేహించి నను ప్రేమించి
జీవమునిచ్చి నను దీవించి
నీ పాత్రగ మలిచావు (2)          ||నను చేరిన||

నీ ప్రేమ నన్ను మార్చింది
నీ రక్తం నన్ను కడిగింది
నీ వాక్యం నన్ను నిలిపింది
నీ మరణం జీవమునిచ్చింది (2)        ||నన్ను ఓర్చి||

నీ మాట నాకు ధైర్యంగా
నీ స్పర్శ నాకు నెమ్మదిగా
నీ ప్రేమ నాకు ఊపిరిగా
నీ స్వరము నాకు శాంతిగా (2)        ||నన్ను ఓర్చి||

English Lyrics

Audio

సిలువ చెంత

పాట రచయిత: 
Lyricist: 

Telugu Lyrics


సిలువ చెంత చేరిననాడు
కలుషములను కడిగివేయున్
పౌలువలెను సీలవలెను
సిద్ధపడిన భక్తులజూచి

కొండలాంటి బండలాంటి
మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన
పిలచుచుండే పరము చేర      ||సిలువ||

వంద గొర్రెల మందలోనుండి
ఒకటి తప్పి ఒంటరియాయే
తొంబది తొమ్మిది గొర్రెల విడిచి
ఒంటరియైన గొర్రెను వెదకెన్    ||సిలువ||

తప్పిపోయిన కుమారుండు
తండ్రిని విడచి తరలిపోయే
తప్పు తెలిసి తిరిగిరాగా
తండ్రియతని జేర్చుకొనియే     ||సిలువ||

పాపి రావా పాపము విడచి
పరిశుద్ధుల విందుల జేర
పాపుల గతిని పరికించితివా
పాతాళంబే వారి యంతము    ||సిలువ||

English Lyrics

Audio

 

 

HOME