చక్కనైన దారి నీవే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చక్కనైన దారి నీవే
చేరువైన తోడు నీవే (2)
యేసయ్యా నీవే చాలయ్యా
నా బ్రతుకునందు ఎన్నడూ వీడిపోకయ్యా (2)

చిన్న చిన్న బాధలకే భయపడిపోయానయ్యా
జయమే లేదనుకొని ఏడ్చినానయ్యా (2)
యేసయ్యా ఆశ్రయం నీవైనావయ్యా
యేసయ్యా భుజంపై చెయ్యేసావయ్యా
నీ ప్రేమనెవరు ఆపలేరయ్యా
ఎంత ఉపకార బుద్ధి నీదయ్యా (2)       ||చక్కనైన||

అడిగినదానికన్నా అధికం చేసావయ్యా
నీ స్థానం ఎవ్వరికి చెందనీనయ్యా (2)
యేసయ్యా గుప్పిలి విప్పుచున్నావు
యేసయ్యా అందని వాడవు కావు
సమీపమైన బంధువువి నీవు
నీ ఆత్మతో దీవించుచున్నావు (2)       ||చక్కనైన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

గూడు లేని గువ్వలా

పాట రచయిత: గుంటూరు రాజా
Lyricist: Guntur Raja

Telugu Lyrics


గూడు లేని గువ్వలా దారి తప్పితి
గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)
నీ గుండెలో దాచుమా
నీ గూటికే చేర్చుమా (2)
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా        ||గూడు||

గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠం
నాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం (2)
నువ్వంటే ఇష్టం యేసయ్యా
నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2)        ||నా ప్రాణమా||

చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టం
నీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం (2)
నేనంటే నీకెంతో ఇష్టమయ్యా
నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2)        ||నా ప్రాణమా||

English Lyrics

Audio

పరలోకమే నా అంతఃపురం

పాట రచయిత: సిరివెళ్ల హనోక్
Lyricist: Sirivella Hanok

Telugu Lyrics


పరలోకమే నా అంతఃపురం
చేరాలనే నా తాపత్రయం (2)
యేసుదేవరా – కనికరించవా – దారి చూపవా (2) ||పరలోకమే||

స్వల్ప కాలమే ఈ లోక జీవితం
నా భవ్య జీవితం మహోజ్వలం (2)
మజిలీలు దాటే మనోబలం
నీ మహిమ చూసే మధుర క్షణం (2)
వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం – నాకు ఈయవా (2) ||పరలోకమే||

పాపము నెదిరించే శక్తిని నాకివ్వు
పరులను ప్రేమించే మనసే నాకివ్వు (2)
ఉద్రేక పరచే దురాత్మను
ఎదురించి పోరాడే శుద్ధాత్మను (2)
మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం – నాకు నేర్పవా (2) ||పరలోకమే||

English Lyrics

Audio

జీవితాంతము నే నీతో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


జీవితాంతము నే నీతో నడవాలని
ఎన్నడూ నీ చేయి నేను విడువరాదని
నీ సన్నిధిలో నిత్యము నే ఉండాలని
నీ నిత్య ప్రేమలో నేను నిలవాలని
నా మనసంతా నీవే నిండాలని
తీర్చుమయ్యా నా ప్రభు ఈ ఒక్క కోరిక
పడితినయ్యా పడితిని నీ ప్రేమలోనే పడితిని
యేసయ్యా ఓ యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా (2)
దారి తప్పి ఉన్న నన్ను వెదకి రక్షించినావయ్యా (2)

నే కన్న పగటి కలలన్ని కల్లలాయెను
నీవు లేని నాస్వానికి వ్యర్థమాయెను (2)
నరుని నమ్ముటే నాకు మోసమాయెను
భయముతోటి నా కన్ను నిద్ర మరచెను (2)
మనసులోన మానిపోని గాయమాయెను (2)
నీ ప్రేమ ఇచ్చె నాకు ఓ కొత్త జీవితం (2)         ||పడితినయ్యా||

లోక పొగడ్తలకు నే పొంగిపోతిని
దాని కనుసైగలోన నేను నడచుకొంటిని (2)
చెడ్డదైన బ్రతుకు సరి జేయ జూసితి
ప్రయాసము వ్యర్ధమై నే నిరసిల్లితి (2)
ముగిసిపోయెననుకుంటి నా ప్రయాణము (2)
నీ ప్రేమ ఇచ్చె నాకు ఓ కొత్త జీవితం (2)         ||పడితినయ్యా||

English Lyrics

Audio

విడువను నిను ఎడబాయనని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


విడువను నిను ఎడబాయనని నా
కభయ మొసంగిన దేవా
నా కభయ మొసంగిన దేవా

నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా (2)
నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా         ||విడువను||

పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా (2)
నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా          ||విడువను||

మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తొడిగితివయ్యా (2)
గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి        ||విడువను||

సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా (2)
నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించెదను         ||విడువను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

ఓ ప్రభువా ఓ ప్రభువా

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి (4)     ||ఓ ప్రభువా||

దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి (2)
నిత్య జీవము నిచ్చిన దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||

నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక (2)
అంతము వరకు కాపాడు దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||

ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)
నన్ను నీవు మరువని దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దారి తప్పి పోతున్నావా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దారి తప్పి పోతున్నావా విశ్వాసి
తీరమేదో గమనించావా విశ్వాసి (2)

ఈ లోకం ముళ్ళ బాట
విశ్రాంతి లేని చోట (2)
యేసయ్యే జీవపు బాట
సాగిపో ఆయన వెంట (2)
యేసుతో నీవొస్తావా విశ్వాసి
లోకం విడిచి రానంటావా విశ్వాసి (2)        ||దారి||

ఓడలోని నల్ల కాకి
చూడ నేర్చే ఈ లోకాన్ని (2)
చూడ చూడ లోకపు రుచి
ఓడ మరచిపోయే కాకి (2)
కాకిలా నీవుంటావా విశ్వాసి
పావురంలా తిరిగొస్తావా విశ్వాసి (2)       ||దారి||

ఓడలోనున్ననాడు
యేసు నీకు తోడుంటాడు (2)
ఆశ్రయంబుగా ఉంటాడు
ఆశలన్నీ తీరుస్తాడు (2)
యేసులో నీవుంటావా విశ్వాసి
సంఘమందు చేరుంటావా విశ్వాసి (2)      ||దారి||

English Lyrics

Audio

 

 

రెండే రెండే దారులు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రెండే రెండే దారులు
ఏ దారి కావాలో మానవా
ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2)
పరలోకం కావాలో పాతాళం కావాలో
తెలుసుకో మానవా (2)

పరలోకం గొప్ప వెలుగుతో
ఉన్నాది పరిశుద్ధుల కోసం (2)
సూర్యుడుండడు చంద్రుడుండడు
చీకటుండదు రాత్రియుండదు
నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2)
యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2)
యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2)      ||రెండే||

పాతాళం అగ్ని గుండము
ఉన్నాది ఘోరపాపుల కోసం (2)
అగ్ని ఆరదు పురుగు చావదు
గప్పగప్పున రగులుచుండును
ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2)
అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2)
ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2)       ||రెండే||

పుడతావు నీవు దిగంబరిగా
వెళతావు నీవు దిగంబరిగా (2)
గాలి మేడలు ఎన్నో కడతావు
నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2)
ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2)
అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2)         ||రెండే||

English Lyrics

Audio

 

 

HOME