పావురమా నీ ప్రేమ

పాట రచయిత: జాన్ పాల్
Lyricist: John Paul

Telugu Lyrics

పావురమా నీ ప్రేమ ఎంత మధురము
పావురమా నీ మనసు ఎంత నిర్మలము
జుంటి తేనె ధార కన్నా
మంచి గోధుమ పంట కన్నా (2)
ప్రేమ మధురము – నీ మనసు నిర్మలము (2)
నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము
నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము

కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను
ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2)
ఎటు చూసిననూ ఎం చేసిననూ
మదిలో నిన్నే తలంచుచున్నాను (2)
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా (2)      ||నా యేసయ్యా||

దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు
పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2)
నా వాడు నా ప్రియుడు
మదిలో నిన్నే తలంచుచున్నాడు (2)
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా (2)      ||నా యేసయ్యా||

English Lyrics

Audio

అంతే లేని నీ ప్రేమ ధార

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

అంతే లేని నీ ప్రేమ ధార
ఎంతో నాపై కురిపించినావు
వింతైన నీ ప్రేమ కొంతైన గాని
కాంతింప కృప నాకు చూపించినావు (2)
ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో
పొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కాను
అంతో ఇంతో ఆ ప్రేమను నేను
పంచేటందుకు నీ భాగ్యము పొందాను       ||అంతే||

పరిశుద్ధుడు పరిశుద్ధుడు
అని దూతలతో పొగడబడే దేవా
పదివేలలో అతి సుందరుడా
నీవేగా అతి కాంక్షనీయుడా (2)
నా దోషములకై ఆ కలువరి సిలువలో
బలియాగమైనావ దేవా (2)
సొంతముగా నే చేసిన నా పాపములన్ని
శాంతముతో సహియించి క్షమియించినావు
పంతముతో నిను వీడి నే పారిపోగా
నీ రాజ్యమునకు చేర్చగ వంతెన అయినావు          ||అంతే||

ఏమున్నదీ నాలో దేవా
మంచన్నదే లేనే లేదు
అయినా నీవు నను రక్షించి
నీ సాక్షిగ నిలిపావు ఇలలో (2)
అర్హతయే లేదు నీ పేరు పిలువ
నీ సొత్తుగా నను మార్చినావా (2)
ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు బదులు
నా జీవితమంతయును నీ కొరకే దేవా
నీ సేవలో నేను కొనసాగెదనయ్యా
ప్రకటింతు నీ ప్రేమ తుది శ్వాస వరకు         ||అంతే||

English Lyrics

Audio

కలువరి గిరి నుండి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కలువరి గిరి నుండి
ప్రవహించే ధార
ప్రభు యేసు రక్త ధార (2)
నిర్దోషమైన ధార
ప్రభు యేసు రక్త ధార (2)
ప్రభు యేసు రక్త ధార (2)       ||కలువరి||

నా పాపముకై నీ చేతులలో
మేకులను దిగగొట్టిరా (2)
భరియించినావా నా కొరకే దేవా
నన్నింతగా ప్రేమించితివా (2)     ||కలువరి||

నా తలంపులే నీ శిరస్సుకు
ముండ్ల కిరీటముగా మారినా (2)
మౌనము వహియించి సహియించినావా
నన్నింతగా ప్రేమించితివా (2)       ||కలువరి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME