స్తుతి మధుర గీతము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము
చెల్లించుటే నా ధన్యత
బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము
చేరడమే నా ఆతృత
అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద
నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద      ||స్తుతి||

కనులకే కనపడలేని నా కంటి పాపవై
కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము (2)
నాకే తెలియక నాలో
నీవు నాదు ప్రాణ శ్వాసవై
నడిపించావా దేవా ఇన్నాళ్లుగా        ||స్తుతి||

అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి
నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి (2)
రాతి గుండెను దిద్ది
గుడిగా మార్చుకున్న దైవమా
ముల్లును రెమ్మగా మార్చితివి        ||స్తుతి||

English Lyrics

Audio

ద్రాక్షావల్లివి నీవైతే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ద్రాక్షావల్లివి నీవైతే
తీగెగ నేను ఎదిగితిని (2)
తండ్రి తోటలో నే నాటబడితి
ఎంత ధన్యత ఈ మహిలో – (2)        ||ద్రాక్షా||

చల్ల గాలులు వీచగా
కాంతి కిరణాలు ప్రసరించగా (2)
నీతి సూర్యుని నిజ కాంతిలోన
తేజరిల్లెడి బ్రతుకు తోడ
రక్షణ తోటలో విరివిగ పెరిగి
నీటి యోరన నిలిచితిని – (2)        ||ద్రాక్షా||

కొమ్మ కొమ్మను చూడగా
తీగలెన్నో అగుపించెనే (2)
ఆకు మాటున తీగె గావున
మొలవనున్నవి ఫలములెన్నో
నిలిచె అందులో ఫలితము కొరకై
కలిగె స్నేహము యేసునితో – (2)        ||ద్రాక్షా||

English Lyrics

Audio

HOME