హీనమైన బ్రతుకు నాది

పాట రచయిత: బాలరాజ్
Lyricist: Balraj

Telugu Lyrics

హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2)
దాపు జేరితిని శరణు కోరితిని
దిక్కు నీవే నాకు ఇలలో
లేరు ఎవ్వరు నాయను వారు      ||హీనమైన||

మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోత
మదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత (2)
కరుణించి నన్ను కష్టాలు బాపు (2)
కరుణామయా క్రీస్తేసువా      ||హీనమైన||

తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమ
భార్య భర్తల కన్న మిన్న – మారని నీ ప్రేమ (2)
పాపి కొరకు ప్రాణమర్పించిన (2)
త్యాగ శీలివి నీకే స్తోత్రము        ||హీనమైన||

నిన్న నేడు రేపు యేసు – మారనే మారవు
లోకులంత మారిపోయిన – స్థిరమైన వాడవు (2)
వెరువను జడియను (2)
నీ కంటి పాపను నను కాచే దైవమా         ||హీనమైన||

English Lyrics

Audio

ఏ రీతి నీ ఋణం

పాట రచయిత: తాటపూడి జ్యోతి బాబు
Lyricist: Thatapudi Jyothi Babu

Telugu Lyrics


ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2)
ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా
ఎంతో కృపను చూపి దీవించినావయ్యా           ||ఏ రీతి||

పాపాల సంద్రమందున పయనించు వేళలో (2)
పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా          ||ఏ రీతి||

నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా (2)
నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా           ||ఏ రీతి||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

దిక్కులెన్ని తిరిగినా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2)
మనకు దిక్కు ఈ బాల యేసుడే
ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో
ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2)

కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2)
స్థలము లేక తిరిగి వేసారెను
నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2)
కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2)
నేడు నోవాహు ఓడ జోరేబు కొండ
గుర్తుగా ఉన్నాయి చూడండి         ||దిక్కులెన్ని||

దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల (2)
తన మార్గమందు నడుప బుట్టెను
ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2)
జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2)
నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి
హృదయాలు అర్పించినారయ్యో             ||దిక్కులెన్ని||

English Lyrics

Audio

తూర్పు దిక్కు చుక్క బుట్టె

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


తూర్పు దిక్కు చుక్క బుట్టె
మేరమ్మా – ఓ మరియమ్మా (2)
చుక్కను జూచి మేము వచ్చినాము
మొక్కి పోవుటకు (2)             ||తూర్పు దిక్కు||

బెత్లెహేము పురము లోని బాలుడమ్మా
గొప్ప బాలుడమ్మా (2)
మన పాపముల బాప పుట్టెనమ్మా
మహిమవంతుడమ్మా (2)        ||తూర్పు దిక్కు||

పశువుల పాకలోని బాలుడమ్మా
పాపరహితుడమ్మా (2)
పాపంబు బాపను పుట్టెనమ్మా
సత్యవంతుడమ్మా (2)             ||తూర్పు దిక్కు||

బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము
బాల యేసు నొద్దకు (2)
బంగారు పాదముల మ్రొక్కెదము
బహుగ పాడెదము (2)            ||తూర్పు దిక్కు||

English Lyrics

Audio

HOME