క్రీస్తేసు పుట్టెను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

క్రీస్తేసు పుట్టెను.. లోక రక్షకునిగా..
పశులపాక పావనమై.. పరవశించెనుగా…
పరవశించెనుగా…

క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగా
పశులపాక పావనమై పరవశించెనుగా
గొర్రెల కాపరులు సంతోషముతో
గంతులు వేసెను ఆనందముతో (2)
తూర్పు దిక్కున చుక్క వెలిసెను
లోక రక్షకుడు భువికి వచ్చెను (2)        ||క్రీస్తేసు||

హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్

ఆదివాక్యము శరీరధారియై లోకమందు సంచరించెను
చీకటిని చీల్చి జనులందరికి వెలుగును ప్రసాదించెను (2)
పాపములు తీసి పరిశుద్ధపరచి రక్షణ వరమందించే
ఆ యేసు రాజును స్తుతియించి ఘనపరచ రారండి (2)          ||తూర్పు దిక్కున||

సంతోషము సమాధానము కృపా కనికరము
మన జీవితములో ప్రవేశించెను బహుదీవెనకరము (2)
సంబరాలతో సంతోషాలతో వేడుకొన రారండి
బంగారము సాంబ్రాణి బోళము సమర్పించ రారండి (2)          ||తూర్పు దిక్కున||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పుట్టినాడంట యేసునాథుడు

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

తూరుపు దిక్కున చుక్క బుట్టె
దూతలు పాటలు పాడ వచ్చె (2)
చలి మంట లేకుండా ఎలుగే పుట్టె (2)
చల్లని రాతిరి కబురే తెచ్చె (2)
పుట్టినాడంట యేసునాథుడు
పాపములు తీసే పరమాత్ముడు (2)        ||తూరుపు||

గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి
కొలిచినారు తనకు కానుకలిచ్చి
పశుల పాక మనము చేరుదాము
కాపరిని కలిసి వేడుదాము (2)        ||పుట్టినాడంట||

చిన్నా పెద్దా తనకు తేడా లేదు
పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు
తానొక్కడే అందరికీ రక్షకుడు
మొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు (2)        ||పుట్టినాడంట||

మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడు
చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు
నమ్మి నీవు యేసును అడిగి చూడు
తన ప్రేమను నీకు అందిస్తాడు (2)        ||పుట్టినాడంట||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

జన్మించెను ఒక తార

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

జన్మించెను ఒక తార
తూర్పు దిక్కున కాంతిమయముగా
దివి నుండి భువికి వెడలిన
రారాజును సూచిస్తూ (2)

హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)            ||జన్మించెను||

ఇదిగో జనులందరికి
సంతోషకరమైన సువార్తమానము (2)
దేవాది దేవుండు
ఒక శిశువై పుట్టెను (2)         ||హ్యాప్పీ||

సర్వోన్నత స్థలములలో
దేవునికి మహిమ ఆయనకిష్టులకు (2)
భూమియందు
సమాధానము (2)               ||హ్యాప్పీ||

మనలను పాపాలనుండి
రక్షించు దేవుడు ఆయనే యేసు (2)
నీ కొరకే అరుదించే
తన ప్రాణం నిచ్చుటకై (2)       ||హ్యాప్పీ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME