స్తుతించెదను నిన్ను నేను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


స్తుతించెదను – నిన్ను నేను మనసారా
భజించెదను – నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు నీవే ప్రభు
సమస్తము నీ కర్పించెదను (2)        ||స్తుతించెదను||

పూజార్హుడవు పవిత్రుడవు
పాపిని క్షమియించె మిత్రుడవు (2)
పరము చేర్చి ఫలములిచ్చె
పావనుడగు మా ప్రభువు నీవే (2)        ||స్తుతించెదను||

కృపా కనికరములు గల దేవా
కరుణ జూపి కనికరించు (2)
కంటి రెప్ప వలె కాపాడు
కడవరకు మమ్ము కావుమయ్య (2)        ||స్తుతించెదను||

సర్వశక్తి గల మా ప్రభువా
సజీవ సాక్షిగా చేయుమయా (2)
స్థిరపరచి మమ్ము బలపరుచు
సదా నీకే స్తోత్రాలర్పింతును (2)        ||స్తుతించెదను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దినదినము విజయము

పాట రచయిత: కృపాల్ మోహన్
Lyricist: Kripal Mohan

Telugu Lyrics


దినదినము విజయము మనదే
జయశీలుడైన యేసునిలో
భయమే లేదు మాకు దిగులే లేదు
సైన్యములకు అధిపతి యుండగా
సాతానును ఓడించెను
స్వేచ్చా జీవము మాకిచ్చెను
పాప శాపములు తొలగించెను
పరిపూర్ణ జీవము మాకిచ్చెను (2)

హోసన్నా జయం మనదే (3)
హోసన్నా జయం జయం మనదే           ||దినదినము||

English Lyrics

Audio

యేసు గొరియ పిల్లను నేను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన గొరియ పిల్లను (2)
దినదినము చనిపోవుచున్నాను
యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2)       ||యేసు గొరియ||

నా తలపై ముళ్ళు గుచ్చబడినవి
నా తలంపులు ఏడుస్తున్నవి (2)
నా మోమున ఉమ్మి వేయబడినది
నా చూపులు తల దించుకున్నవి (2)       ||యేసు గొరియ||

నా చేతుల సంకెళ్ళు పడినవి
నా రాతలు చెరిగిపోతున్నవి (2)
నా కాళ్ళకు మేకులు దిగబడినవి
నా నడకలు రక్త సిక్తమైనవి (2)      ||యేసు గొరియ||

English Lyrics

Audio

 

 

HOME