అంధకార చెరసాలలో

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics

అంధకార చెరసాలలో – బంధకాల ఇరుకులో
పౌలు సీలలు ప్రార్ధించిరి – కీర్తనలు పాడిరి – (2)
భూమియే కంపించెను – చెరసాల అదిరెను
వారి సంకెళ్లు ఊడిపోయెను – విడుదల దొరికెను – (2)

వ్యాధులు ఆవరించగా – మరణము తరుముచుండగా
రండి పారి పోదుము – ఇంక దాగి యుందుము
ఏ తెగులు దరిచేరని – ఏ దిగులు ఉండని
మన దాగు స్థలములో – యేసుని సన్నిధిలో          ||అంధకార||

ప్రార్ధన చేసెదము – దేవుని సముఖములో
ఈ శోధన సమయములో – విరిగిన హృదయముతో
ఈ లోక రక్షణకై – జనముల స్వస్థతకై
యేసుని వేడెదము – శోకము తొలగించమని          ||అంధకార||

మొరలను ఆలకించును – యేసు మనలను విడిపించును
ఈ లోకమును శుద్ధిచేయును – మరణమును తప్పించును
మన రక్షణ వలయముగా – తన రెక్కలు చాపును
దుఃఖమును సంతోషముగా – మార్చివేయును త్వరలో          ||అంధకార||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఎంతో భాగ్యంబు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను
మనకెంతో భాగ్యంబు
వింతైన తన మహిమనంత విడచి మన కొరకై
చింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె         ||ఎంతో||

పరలోకమును విడచి మనుజ కుమారుడయ్యె
నరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు          ||ఎంతో||

బాలుడయ్య తన జనకుని – పని నెరిగిన వాడయ్యే
ఈ లోకపు జననీ జనకులకెంతో లోబడనే         ||ఎంతో||

పెరిగెను జ్ఞానమందు – మరియు దేహ బలమందు
పరమేశుని దయయందు నరుల కనికరమందు          ||ఎంతో||

English Lyrics

Audio

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఎనలేని నీ ప్రేమను (2)
నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)
తరియించు వరమే దొరికెను (2)        ||ఊహించ||

నా మనసు వేదనలో – నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను (2)
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను (2)        ||ఊహించ||

నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను (2)
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము (2)        ||ఊహించ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME