ఎలోహిం ఎలోహిం

పాట రచయిత: అంశుమతి మేరీ
Lyricist: Amshumathi Mary

Telugu Lyrics

హోలీ హోలీ హోలీ
హి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ
హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2)

ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం
బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు – (2)
శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము
సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం
అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు – (2)
నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు
నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్
పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు – (2)
రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా
నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

అడోనై అడోనై అడోనై అడోనై
ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు – (2)
సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు
నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

యావే యావే యావే యావే
యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి – (2)
పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు
ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

English Lyrics

Audio

శుభవేళ స్తోత్రబలి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శుభవేళ – స్తోత్రబలి
తండ్రీ దేవా – నీకేనయ్యా
ఆరాధన – స్తోత్రబలి
తండ్రీ దేవా – నీకేనయ్యా
తండ్రీ దేవా – నీకేనయ్యా (2) ||శుభవేళ||

ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2)
సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) ||శుభవేళ||

ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2)
నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2) ||శుభవేళ||

యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా (2)
మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా (2) ||శుభవేళ||

యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా (2)
శాంతి నొసగువాడా – యెహోవా షాలోం (2) ||శుభవేళ||

English Lyrics

Audio

HOME