నీవే నా సర్వము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీవే నా సర్వము నీవే నాకున్నావు
నీవే నా సర్వము అన్నిటిలో
నీ జీవం నా కొరకు ఇచ్చినందున
నీవే నా సర్వము అన్నిటిలో (2)

తేనె కంటే మధురము (2)
యేసయ్యే నాకు మాధుర్యము
రుచి చూచి ఎరిగితిని కృపా బాహుళ్యమును
యేసయ్యే నాకు మాధుర్యము            ||తేనె||

నీవే నా రక్షణ నీవే నిరీక్షణ
నీవే కదా నా ఆధారము
నీ పాదములకు మ్రొక్కెదను
నీ నామం పాడి స్తుతించెదను (2)         ||తేనె||

నీవే పరిహార నీవే పరమౌషధం
నీవే నా శక్తివి నా యేసయ్యా
కల్వరి సిలువపై బాలి అయితివే
నే బాగుపడితిని గాయములచే (2)         ||తేనె||

నీవే నా కీర్తివి నీవే నా అతిశయం
నీవే నా మేలులు నా యేసయ్యా
నీ పాద సేవయే చేయుటయే
నా హృదయములున్న వాంఛయేగా (2)         ||తేనె||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

రుచి చూచి ఎరిగితిని

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2)
రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2)         || రుచి చూచి||

గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2)
తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2)   || రుచి చూచి||

మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2)
మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2)   || రుచి చూచి||

మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో(2)
ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2)  || రుచి చూచి||

కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను (2)
క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను (2)     || రుచి చూచి||

ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి (2)
సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని (2)    || రుచి చూచి||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME