గొప్పవాడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

గొప్పవాడు – క్రీస్తు యేసు – పుట్టినాడు నీ కోసం
పాటలు పాడి – నాట్యము చేసి – ఆరాధింప రారండి (2)
ప్రేమామయుడు మహిమాన్వితుడు
ఉన్నవాడు అనువాడు (2)
మహిమ ఘనత నిత్యం యేసుకు
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్            ||గొప్పవాడు||

ఆశ్చర్యకార్యాలు చేసేవాడు యేసు
నీ పాప జీవితం మార్చేవాడు యేసు (2)
నీ బాధలన్ని తీర్చేవాడు యేసు
సంతోష జీవితం ఇచ్ఛేవాడు యేసు (2)         ||మహిమ||

నీ రోగాలను స్వస్థపరచునేసు
నీ శాపాలను తీసివేయునేసు (2)
నీ శోకాలను మాన్పివేయునేసు
పరలోక భాగ్యం నీకు ఇచ్చునేసు (2)         ||మహిమ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మంచివాడు గొప్పవాడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు
మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికి (2)
ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో (2)      ||మంచివాడు||

ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు
దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును (2)        ||ఆదరణ||

ఓటమి అంచున పడియుంటివా మేలుకో ఓ సోదరా
యేసయ్య నీ తల పైకెత్తి శత్రువును అణగద్రొక్కును (2)        ||ఆదరణ||

దుష్టుడా శత్రు సాతానా విజయము నాదిప్పుడు
నీ తల నా కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కెదను (2)        ||ఆదరణ||

ఆహా ఆహా ఆనందమే యేసయ్యతో జీవితం
సంతోషమే సమాధానమే ఎల్లప్పుడు ఆయనలో (2)        ||ఆదరణ||

English Lyrics

Audio

HOME