ఇదిగో నేనొక నూతన క్రియను

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను (2)
ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా (2)       ||ఇదిగో||

అడవిలో త్రోవనుజేసి – ఎడారిలో నదులను నేను (2)
ఎల్లప్పుడు సమృద్ధిగా – ప్రవహింప జేసెదను (2)       ||ఇదిగో||

నాదు ప్రజలు త్రాగుటకు – నేనరణ్యములో నదులు (2)
సమృద్ధిగా పారునట్లు – సృష్టించెదను నేను (2)       ||ఇదిగో||

అరణ్యములో జంతువులు – క్రూరపక్షులు సర్పములు (2)
ఘనపరచును స్తుతియించును – దీని నాలోచించుడి (2)       ||ఇదిగో||

నూతన సృష్టిగ నినుజేసి – నీ శాంతిని నదివలెజేసి (2)
ననుజూచి మహిమపరచి – స్తుతిబాడ జేసెదను (2)       ||ఇదిగో||

నేనే దేవుడనని దెలసి – నా కార్యములను నెరవేర్చి (2)
ముందున్న వాటికన్న – ఘనకార్యములను జేతున్ (2)       ||ఇదిగో||

మరుగైన మన్నానిచ్చి – మరితెల్లని రాతినిచ్చి (2)
చెక్కెదనా రాతిమీద – నొక క్రొత్త నామమును (2)       ||ఇదిగో||

పరలోక భాగ్యంబులు – నరలోకములో మనకొసగెన్ (2)
కరుణాసంపన్నుడగు – మన ప్రభువునకు హల్లెలూయ (2)       ||ఇదిగో||

Download Lyrics as: PPT

ఇదిగో దేవా ఈ హృదయం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ మనసు
ఇదిగో దేవా ఈ దేహం
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిశుద్ధ అగ్నితో కాల్చుమా (2)

పనికిరాని తీగలున్నవి
ఫలమివ్వ అడ్డుచున్నవి (2)
ఫలియించే ఆశ నాకుంది      ||ఈ నీ||

ఓ నా తోటమాలి
ఇంకో ఏడాది గడువు కావాలి (2)
ఫలియించే ఆశ నాకుంది      ||ఈ నీ||

English Lyrics

Audio

దేవుని ప్రేమ ఇదిగో

పాట రచయిత: గొల్లపల్లి నతానియేలు
Lyricist: Gollapalli Nathaaniyelu

Telugu Lyrics


దేవుని ప్రేమ ఇదిగో – జనులార – భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును         ||దేవుని||

సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను
సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను         ||దేవుని||

మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను
మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే         ||దేవుని||

యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల
దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు         ||దేవుని||

పాప భారంబు తోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడి
పాపులందరు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను         ||దేవుని||

సతులైన పురుషులైనన్ – యా కర్త – సర్వ జనుల యెడలను
సత్ప్రేమగా నడిచెను – పరలోక – సద్బోధలిక జేసెను         ||దేవుని||

చావు నొందిన కొందరిన్ – యేసుండు – చక్కగా బ్రతికించెను
సకల వ్యాధుల రోగులు – ప్రభు నంటి – స్వస్థంబు తా మొందిరి         ||దేవుని||

గాలి సంద్రపు పొంగులన్ – సద్దణిపి – నీళ్లపై నడచినాడే
మేలు గల యద్భుతములు – ఈలాగు – వేల కొలదిగ జేసెను         ||దేవుని||

చేతుల కాళ్లలోను – రా రాజు – చేర మేకులు బొందెను
పాతకులు గొట్టినారే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్         ||దేవుని||

ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగు లందరు గొట్టిరి
వడిముళ్లు తల మీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుండు         ||దేవుని||

ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను
మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను         ||దేవుని||

రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్
రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను         ||దేవుని||

రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబును
పాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాతు లందరు జూడగా         ||దేవుని||

మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడు
నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్         ||దేవుని||

పదునొకండు మారులు – వారలకు – బ్రత్యక్షు డాయె నేసు
పరలోకమున కేగెను – తన వార్త – బ్రకటించు మని పల్కెను         ||దేవుని||

నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణ మరి కల్గును
నమ్మ నొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను         ||దేవుని||

English Lyrics

Audio

ఇదిగో దేవుని గొర్రెపిల్లా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఇదిగో దేవుని గొర్రెపిల్లా
ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2)
అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి
నీదు ప్రజలను కొనినావు
అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు
నీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో||

పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి (2)
సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను (2)        ||అర్హుడవు||

దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా (2)
యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను (2)        ||అర్హుడవు||

దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి (2)
క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను (2)        ||అర్హుడవు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కృపామయుడా

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

కృపామయుడా – నీలోనా (2)
నివసింప జేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం
కృపామయుడా…

ఏ అపాయము నా గుడారము
సమీపించనీయక (2)
నా మార్గములన్నిటిలో
నీవే ఆశ్రయమైనందున (2)         ||కృపామయుడా||

చీకటి నుండి వెలుగులోనికి
నన్ను పిలచిన తేజోమయా (2)
రాజవంశములో
యాజకత్వము చేసెదను (2)       ||కృపామయుడా||

నీలో నిలిచి ఆత్మ ఫలము
ఫలియించుట కొరకు (2)
నా పైన నిండుగా
ఆత్మ వర్షము కుమ్మరించు (2)      ||కృపామయుడా||

ఏ యోగ్యత లేని నాకు
జీవ కిరీటమిచ్చుటకు (2)
నీ కృప నను వీడక
శాశ్వత కృపగా మారెను (2)      ||కృపామయుడా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

ఇదిగో దేవా నా జీవితం

పాట రచయిత: వై బాబ్జి
Lyricist: Y Babji

Telugu Lyrics

ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం (4)                       ||ఇదిగో||

పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం        ||ఇదిగో||

నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము      ||ఇదిగో||

విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు (2)
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా         ||ఇదిగో||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME