యేసయ్యా యేసయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా యేసయ్యా… నీదెంత జాలి మానసయ్యా
యేసయ్యా యేసయ్యా… నీదెంత దొడ్డ గుణమయ్యా
నిన్ను సిలువకు వేసి మేకులేసినోల్ల చేతులే
కందిపోయెనేమో అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నావోడివి     ||యేసయ్యా||

ఒంటి నిండ రగతం – గొంతు నిండ దాహం
అయ్యో.. ఆరిపోవు దీపం
అయినా రాదు నీకు కోపం
గుండెలోన కరుణ – కళ్ళలోన పొంగి
జారే కన్నీళ్లు మాత్రం
పాపం చేసినోల్ల కోసం       ||యేసయ్యా||

నమ్మినోల్ల పాపం – మోసినావు పాపం
నిను మోసి కట్టుకుంది పుణ్యం
ఆహా సిలువదెంత భాగ్యం
ఓడిపోయి మరణం – సాక్ష్యమిచ్చుఁ తరుణం
మళ్ళీ లేచి వచ్చుఁ నిన్నే
చూసిన వారి జన్మ ధన్యం      ||యేసయ్యా||

English Lyrics

Audio

ప్రభువా ప్రభువా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ప్రభువా ప్రభువా
కడలిని మా గాథ వినవా
ప్రభువా ప్రభువా
ఇకనైనా మా జాలి గనవా
ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు
ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధనల్        ||ప్రభువా||

ఎదలో చెలరేగే సుడిగాలుల్లో
ఎగసే ఆశ నిరాశ కెరటాలు
నావకు చుక్కానివై
నాలో ధైర్యం కలిగించవా
సహనము శాంతము కరువు అయిన బ్రతుకులో
మరియ తనయా మరి ఇంకా ఎన్నాళ్లీ శోధనల్        ||ప్రభువా||

దేవా నీ దయలో ధన్యుడనవ తగనా
నాలో విశ్వాసం ఇంకా చాలాదనా
మందలో నీ అండలో
నేను ఉన్నా గొర్రెపిల్లనై
దీనులు అనాథలు అభాగ్యులైన ఎందరినో
నడిపించు ఓ తండ్రి నాకింక ఎన్నాళ్లీ శోధనల్          ||ప్రభువా||

English Lyrics

Audio

ఎందుకో ఈ ప్రేమ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెను
ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను (2)
ఏ యోగ్యత లేని ఓటి కుండను
నీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి (2)
ఎనలేని కృపనిచ్చితివి         ||ఎందుకో||

నీ సన్నిధి పలుమార్లు నే వీడినానే
అయినా నీవు క్షమియించినావే
ఊహించని మేలులతో దీవించినావే
నా సంకటములను కదా తీర్చినవే (2)
ఏ యోగ్యత లేని దీనుడను
ఏమివ్వగలను నీ ప్రేమకు
(నా) సర్వం నీకే అర్పింతును – (2)         ||ఎందుకో||

మా కొరకు బలి పశువై మరణించినావు
మా పాప శిక్ష తొలగించినావు
పలు విధముల శోధనలో తోడైనావు
ఏ కీడు రాకుండ మేము కాచినావు (2)
రుచి చూపినావు నీ ప్రేమను
ఆ ప్రేమలో నేను జీవింతును
నీవే నాకు ఆధారము – (2)         ||ఎందుకో||

English Lyrics

Audio

ఎంత జాలి యేసువా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఎంత జాలి యేసువా
యింతయని యూహించలేను     ||ఎంత||

హానికరుడ హింసకుడను
దేవదూషకుడను నేను (2)
అవిశ్వాసినైన నన్ను (2)
ఆదరించినావుగా     ||ఎంత||

రక్షకుండ నాకు బదులు
శిక్ష ననుభవించినావు (2)
సిలువయందు సొమ్మసిల్లి (2)
చావొందితివి నాకై     ||ఎంత||

ఏమి నీ కర్పించగలను
ఏమి లేమి వాడనయ్యా (2)
రక్షణంపు పాత్రనెత్తి (2)
స్తొత్రమంచు పాడెద     ||ఎంత||

నీదు నామమునకు యిలలో
భయపడెడు వారి కొరకై (2)
నాథుడా నీ విచ్చు మేలు (2)
ఎంత గొప్పదేసువా     ||ఎంత||

నేను బ్రతుకు దినములన్ని
క్షేమమెల్ల వేళలందు (2)
నిశ్చయముగ నీవు నాకు (2)
ఇచ్చువాడా ప్రభువా     ||ఎంత||

నాదు ప్రాణమునకు ప్రభువా
సేద దీర్చు వాడ వీవు (2)
నాదు కాపరివి నీవు (2)
నాకు లేమి లేదుగా     ||ఎంత||

అందరిలో అతి శ్రేష్ఠుండా
అద్వితీయుడగు యేసయ్యా (2)
హల్లెలూయ స్తోత్రములను (2)
హర్షముతో పాడెద     ||ఎంత||

English Lyrics

Audio

Chords

నీదెంతో కరుణా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నీదెంతో కరుణా కరుణామయా
నీదెంతో జాలి నజరేయా (2)

మా పాపమంతా గాయాలుగా
దాల్చావు నీ మీన పూమాలగా (2)
మా కర్మమంతా ఆ సిలువగా
మోసేవు తండ్రి నీ మోపున       ||నీదెంతో||

ప్రభువా మా పాప ప్రక్షాళనముకై
వెలపోసినావు నీ రుధిరమే (2)
దేవా మా ఆత్మ పరిశుద్ధికై
బలి పెట్టినావు నీ ప్రాణమే       ||నీదెంతో||

English Lyrics

Audio

ఈలాటిదా యేసు ప్రేమ

పాట రచయిత: రావూరి రంగయ్య
Lyricist: Raavuri Rangaiah

Telugu Lyrics

ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను
తూలనాడక తనదు జాలి చూపినదా       ||ఈలాటిదా||

ఎనలేని పాప కూపమున – నేను
తనికి మిణుకుచును నే దరి గానకుండన్
కనికరము పెంచి నాయందు – వేగ
గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె        ||ఈలాటిదా||

పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను
మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు
నను నీచుడని త్రోయలేక – తనదు
నెనరు నా కగుపరచి నీతి జూపించె         ||ఈలాటిదా||

నెమ్మి రవ్వంతైనా లేక – చింత
క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి
సమ్మతిని నను బ్రోవ దలచి – కరము
జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె         ||ఈలాటిదా||

పనికిమాలిన వాడనైన – నేను
కనపరచు నా దోష కపటవర్తనము
మనసు నుంచక తాపపడక యింత
ఘనమైన రక్షణ-మును నాకు చూపె         ||ఈలాటిదా||

నా కోర్కెలెల్ల సమయములన్ – క్రింది
లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్
చేకూర్చి ధృడము చిత్తమునన్ – శుభము
నా కొసంగె జీవింప నా రక్షకుండు          ||ఈలాటిదా||

శోధనలు నను చుట్టినప్పుడు – నీతి
బోధ నా మనసులో పుట్టించి పెంచి
బాధలెల్లను బాపి మాపి – యిట్టి
యాదరణ జూపిన యహాఁహాఁ యేమందు        ||ఈలాటిదా||

English Lyrics

Audio

శాశ్వత ప్రేమతో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా
కృప చూపి నన్ను రక్షించవయ్యా (2)
నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది
నీ కృపా గొప్పది – నీ దయ గొప్పది (2)

అనాథనైనా నన్ను వెదకి వచ్చావు
ఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2)        ||నీ ప్రేమ||

అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా
సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2)        ||నీ ప్రేమ||

తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి
తల్లిలా ఆదరించి నడిపించితివి (2)        ||నీ ప్రేమ||

నడుచుచున్న మర్గమంత యోచించగా
కన్నీటితో వందనములు తెలుపుదునయ్యా (2)        ||నీ ప్రేమ||

ప్రభువు చేయవలసినది ఆటంకం లేదు
సమస్తము మేలుకై చేసిన దేవా (2)        ||నీ ప్రేమ||

English Lyrics

Audio

HOME