క్రిస్మస్ వచ్చిందయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు
రక్షణ తెచ్చిందయ్యా చూడు (2)
ఆనందం వెల్లి విరిసే
జగతిలో జ్యోతిగా నేడు (2)
క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణ
యేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా        ||క్రిస్మస్||

లోక పాపం తొలగింప
జీవితాలను వెలిగింప (2)
ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు
విడుదల కలిగించె మనకు (2)       ||క్రీస్తుకు||

యేసుకు మనలో చోటిస్తే
మానమొక తారగ కనిపిస్తాం (2)
పరలోక మార్గం క్రీస్తే
సమస్తము ఆయనకు అర్పిద్దాం (2)       ||క్రీస్తుకు||

English Lyrics

Audio

యేసు క్రీస్తు పుట్టెను నేడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో
మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2)
ఇది పండుగ – క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2)       ||యేసు క్రీస్తు||

పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2)
కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2)        ||ఇది పండుగ||

సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా (2)
నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2)        ||ఇది పండుగ||

శరీర ధారిగా – కృపగల దేవునిగా (2)
పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను (2)        ||ఇది పండుగ||

English Lyrics

Audio

HOME