స్తుతియించి కీర్తించి

పాట రచయిత: సునీల్ ప్రేమ్ కుమార్
Lyricist: Sunil Prem Kumar

Telugu Lyrics


స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2)
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా        ||స్తుతియించి||

గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా (2)
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా (2)
నీ ప్రజలను పోషించినావా           ||స్తుతియించి||

అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2)
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు (2)
నీ ప్రజలను రక్షించినావు           ||స్తుతియించి||

పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2)
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా (2)
మము పరముకు నడిపించు దేవా         ||స్తుతియించి||

English Lyrics

Audio

మరువగలనా మరలా

పాట రచయిత: జోనా శామ్యూల్
Lyricist: Jonah Samuel

Telugu Lyrics


మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా
ఈలాంటి ప్రేమను కలిగినను
క్షమించు నింతటి నేరమును
జీవిత కాలమంతా – యేసు ధ్యానము చేసెదను

ఆశయు అక్కరయు పాపమై
చిక్కితి శత్రువు చేతులలో
మరణపు టంచున చేరితిని
ఇంతలోనే యేసు కరుణింప వచ్చి
క్షమియించి విడిపించెను
ఈలాంటి ప్రేమను కలిగినను
క్షమించు నింతటి నేరమును
నిందను పొందినను – ప్రభు చెంతకు చేరెదను

ఏ పాపికి కడు భాగ్యమే
యేసుని చేరగ ధన్యమే
యేసుని ప్రేమ అనంతమే
నీ పాపమంతా తొలగించి
యేసు ప్రేమించి దీవించును
నీ భారమంతయు భరియించును
కన్నీరు తుడిచి ఓదార్చును
శాశ్వత ప్రేమ చూపి – తన కౌగిట దాచుకొనున్

మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా
ఆ సిల్వ ప్రేమను చూపెదను
నా క్రీస్తు వార్తను చాటెదను
జీవిత కాలమంత – యేసు ధ్యానము చేసెదను

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కాలం సమయం నాదేనంటూ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా
రోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా (2)
దేవుని ముందు నిలిచే రోజుంది
తక్కెడ తూకం వేసే రోజుంది (2)
జీవ గ్రంథం తెరిచే రోజుంది
నీ జీవిత లెక్క చెప్పే రోజుంది
ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా
ఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా (2)        ||కాలం||

ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావా
మేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా (2)
గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమో
ఒక్క ఘడియలెందరో బికారులయ్యారు (2)         ||ఆగవేమయ్యా||

చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు
పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు (2)
నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారు
ఒక్క ఘడియలో ఎందరో నశించిపోయారు (2)         ||ఆగవేమయ్యా||

సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు
సిద్ధపడని వారికి ఆ నరకపు ద్వారాలు (2)
అగ్ని ఆరదు పురుగు చావదు
నిత్యం ఏడుపు దుఃఖాలు (2)           ||ఆగవేమయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా జీవితకాలమంత

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics


నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా
నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా
యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును
నా దేహమే యాగముగా అర్పించిన చాలునా       ||నా జీవిత||

నా బాల్యమంతా నా తోడుగ నిలిచి
ప్రతి కీడు నుండి తప్పించినావు
యవ్వనకాలమున నే త్రోవ తొలగిన
మన్నించి నాతోనే కొనసాగినావు
ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో
నను దైర్యపరిచి నను ఆదుకున్నావు
యేసు నీవే నీవే యేసు… నీవే నా సర్వస్వమూ      ||నా జీవిత||

కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనే
సంతోష ఉదయాలు నాకిచ్చినావు
హృదయాశలన్ని నెరవేర్చినావు
యోగ్యుడను కాకున్న హెచ్చించినావు
ఎంతో ప్రేమ మితిలేని కృపను
నాపై చూపించి నను హత్తుకున్నావు
యేసు నీవే నీవే యేసు… నీవే నా ఆనందమూ      ||నా జీవిత||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

ఇదియేనయ్య మా ప్రార్థన

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

ఇదియేనయ్య మా ప్రార్థన
ఇదియే మా విజ్ఞాపన
ఆలకించే దేవా
మము నీ ఆత్మతో నింపగ రావా (2)

నీ వాక్యములో దాగియున్న
ఆంతర్యమును మాకు చూపించయ్యా
నీ మాటలలో పొంచియున్న
మర్మాలను మాకు నేర్పించయ్యా (2)
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి (2)        ||ఆలకించే దేవా||

నీ దృష్టిలో సరిగా జీవించే
మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా
నీ సృష్టిని మరిగా ప్రేమించే
లోబడని మా మనసులు సరిచేయయ్యా (2)
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి (2)        ||ఆలకించే దేవా||

నీ సువార్తను గొప్పగ చాటే
బెదరని పెదవులు మాకు ఇవ్వుము దేవా
నీ సేవలో తప్పక కొనసాగే
అలుపెరుగని పాదములు నొసగుము ప్రభువా (2)
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి (2)        ||ఆలకించే దేవా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీ వాక్యమే నా పాదాలకు

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

నీ వాక్యమే నా పాదాలకు దీపము
నీ చిత్తమే నా జీవిత గమనము (2)
కృప వెంబడి కృపతో – నను ప్రేమించిన దేవా (2)
వందనాలయ్యా నీకే – వేలకొలది వందనాలయ్యా
స్తోత్రాలయ్యా – కోట్లకొలది స్తోత్రాలయ్యా    ||నీ వాక్యమే||

నీ భారము నాపై వేయుము
ఈ కార్యము నే జరిగింతును (2)
నా కృప నీకు చాలును
అని వాగ్దానమిచ్చావయ్యా (2)        ||వందనాలయ్యా||

పర్వతములు తొలగిననూ
మెట్టలు తత్తరిల్లిననూ (2)
నా కృప నిన్ను వీడదు
అని అభయాన్ని ఇచ్చావయ్యా (2)     ||వందనాలయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME