జీవితాంతము వరకు నీకే

పాట రచయిత: పి డి శుభామణి
Lyricist: P D Shubhaamani

Telugu Lyrics

జీవితాంతము వరకు నీకే – సేవ సల్పుదునంటిని
నీవు నాతో నుండి ధైర్యము – నిచ్చి నడుపుము రక్షకా   ||జీవితాంతము||

ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు కల్గిన
అన్ని పోవును నీవు నాకడ – నున్న నిజమిది రక్షకా   ||జీవితాంతము||

అన్ని వేళల నీవు చెంతనె – యున్న యను భవమీయవె
తిన్నగా నీ మార్గమందున – పూనినడచెద రక్షకా   ||జీవితాంతము||

నేత్రములు మిరుమిట్లు గొలిపెడి – చిత్రదృశ్యములున్నను
శత్రువగు సాతాను గెల్వను – చాలు నీ కృప రక్షకా   ||జీవితాంతము||

నాదు హృదయమునందు వెలుపట – నావరించిన శత్రులన్
చెదర గొట్టుము రూపుమాపుము – శ్రీఘ్రముగ నారక్షకా   ||జీవితాంతము||

మహిమలో నీవుండు చోటికి – మమ్ము జేర్చెదనంటివే
ఇహము దాటినదాక నిన్ను – వీడనంటిని రక్షకా   ||జీవితాంతము||

పాప మార్గము దరికి బోవక – పాత యాశల గోరక
ఎపుడు నిన్నే వెంబడింపగ – కృప నొసంగుము రక్షకా   ||జీవితాంతము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

ఇన్నాళ్లు తోడుగా

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics

ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)
ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
నిన్నే అనుసరింతుము జీవితాంతము (2)

ఘనులైన వారే గతియించగా
ధనమున్నవారే మరణించగా (2)
ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు
మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2)      ||ఇశ్రాయేలు||

మా కంట కన్నీరు జారకుండగా
ఏ కీడు మా దరికి చేరకుండగా (2)
కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు
దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2)      ||ఇశ్రాయేలు||

English Lyrics

Audio

నా జీవితాంతము

పాట రచయిత: ఏ డి శిఖామణి
Lyricist: A D Shikhamani

Telugu Lyrics


నా జీవితాంతము
నీ సేవ చేతునంటిని
నే బ్రతుకు కాలము
నీతోనే నడుతునంటిని
నా మనవి వింటివి
నన్నాదుకొంటివి (2)        ||నా జీవితాంతము||

నీ ప్రేమ చూపించి
నన్ను నీవు పిలిచితివి
నీ శక్తి పంపించి
బలపరచి నిలిపితివి (2)
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2)       ||నా జీవితాంతము||

రోగముతో పలుమార్లు
పడియుండ లేపితివి
ఘోరమై పోకుండా
స్థిరపరచి కాచితివి (2)
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2)       ||నా జీవితాంతము||

దూషించు దుష్టులకు
సిగ్గును కలిగించితివి
వేలాది ఆత్మలకు
మేలుగ నన్నుంచితివి (2)
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2)       ||నా జీవితాంతము||

సంఘములు కట్టుటకు
సామర్ధ్యమిచ్చితివి
ఉపదేశమిచ్చుటకు
దేశములు తిప్పితివి (2)
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2)       ||నా జీవితాంతము||

English Lyrics

Audio

గుణవతి అయిన భార్య

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

గుణవతి అయిన భార్య
దొరుకుట అరుదురా (2)
ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా
జీవితాంతము…
జీవితాంతము తోడురా
వెన్నెల బాటరా (2)
వెన్నెల బాటరా (4)       ||గుణవతి||

అలసినపుడు తల్లిలా
కష్టాలలో చెల్లిలా (2)
సుఖ దుఃఖములలో భార్యగా (2)
భర్త కన్నుల మేడరా        ||జీవితాంతము||

మరచిపోనిది మాసిపోనిది
పెండ్లనే బంధము (2)
మరచిపోకుమా జీవితమున (2)
పెండ్లి నాటి ప్రమాణము           ||జీవితాంతము||

English Lyrics

Audio

జీవితాంతము నే నీతో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


జీవితాంతము నే నీతో నడవాలని
ఎన్నడూ నీ చేయి నేను విడువరాదని
నీ సన్నిధిలో నిత్యము నే ఉండాలని
నీ నిత్య ప్రేమలో నేను నిలవాలని
నా మనసంతా నీవే నిండాలని
తీర్చుమయ్యా నా ప్రభు ఈ ఒక్క కోరిక
పడితినయ్యా పడితిని నీ ప్రేమలోనే పడితిని
యేసయ్యా ఓ యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా (2)
దారి తప్పి ఉన్న నన్ను వెదకి రక్షించినావయ్యా (2)

నే కన్న పగటి కలలన్ని కల్లలాయెను
నీవు లేని నాస్వానికి వ్యర్థమాయెను (2)
నరుని నమ్ముటే నాకు మోసమాయెను
భయముతోటి నా కన్ను నిద్ర మరచెను (2)
మనసులోన మానిపోని గాయమాయెను (2)
నీ ప్రేమ ఇచ్చె నాకు ఓ కొత్త జీవితం (2)         ||పడితినయ్యా||

లోక పొగడ్తలకు నే పొంగిపోతిని
దాని కనుసైగలోన నేను నడచుకొంటిని (2)
చెడ్డదైన బ్రతుకు సరి జేయ జూసితి
ప్రయాసము వ్యర్ధమై నే నిరసిల్లితి (2)
ముగిసిపోయెననుకుంటి నా ప్రయాణము (2)
నీ ప్రేమ ఇచ్చె నాకు ఓ కొత్త జీవితం (2)         ||పడితినయ్యా||

English Lyrics

Audio

నీ దయలో నీ కృపలో

పాట రచయిత: డి సుజీవ్ కుమార్
Lyricist: D Sujeev Kumar

Telugu Lyrics

నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము
నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము
నీ ఆత్మతో నను నింపుమా
నీ సేవలో ఫలియింపగా
దేవా… దేవా…           ||నీ దయ||

కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా
ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2)
ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు
నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2)
ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా
నీవె నా మార్గము – నీవె నా జీవము
నీవె నా గమ్యము – నీవె నా సర్వము
నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా           ||నీ దయ||

ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి
వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2)
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని
నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2)
నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం
నీవె నా తోడుగా – నీవె నా నీడగా
ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా
నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా            ||నీ దయ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME