యేసు రాజా అర్పించెదనయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు రాజా…
అర్పించెదనయ్యా నా జీవితం (2)      ||యేసు రాజా||

పాపములో చిక్కిన నన్ను
శిక్షకు పాత్రగా నిలచిన నన్ను (2)
విడిపించెనయ్యా నీ ప్రేమ బంధం (2)
రమ్మని పిలిచావు
అయ్యా.. నీ సన్నిధిలో నిలిపావు       ||యేసు రాజా||

నీ ఆత్మతో ఆకర్షించి
నీ కృపతో నను వెంబడించి (2)
ఏర్పరిచితివయ్యా నీ సాక్షిగాను (2)
ఎలుగెత్తి చాటెదను
అయ్యా.. నీ ఆత్మలో సాగెదను       ||యేసు రాజా||

అర్పించెదనయ్యా నీకే
నా ఈ శేష జీవితం

English Lyrics

Audio

విలువైనది సమయము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


విలువైనది సమయము ఓ నేస్తమా
ఘనమైనది జీవితం ఓ ప్రియతమా (2)
సమయము పోనివ్వక సద్భక్తితో
సంపూర్ణతకై సాగెదము (2)     ||విలువైనది||

క్రీస్తుతో మనము లెపబడిన వారమై
పైనున్నవాటినే వెదకిన యెడల (2)
గొర్రెపిల్లతొ కలిసి
సీయోను శిఖరముపై నిలిచెదము (2)     ||విలువైనది||

శోధన మనము సహించిన వారమై
క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల (2)
సర్వాధికారియైన
ప్రభువుతో కలిసి ఏలెదము (2)     ||విలువైనది||

క్రీస్తుతో మనము సింహాసనముపై
పాలించుటకై జయమొందుటకు (2)
సమర్పణ కలిగి
పరిశుద్దతలో నిలిచెదము (2)     ||విలువైనది||

English Lyrics

Audio

క్రైస్తవ జీవితం

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం
ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం (2)
కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా
యేసు ప్రభువే నా సహకారి (2)          ||క్రైస్తవ||

ఈ లోక ఘనత నన్ను విడిచినన్
లోకస్థులెల్లరు నన్ను విడిచినన్ (2)
నా సహోదరులు నన్ను విడిచినన్
యోసేపు దేవుడే నా సహకారి (2)          ||క్రైస్తవ||

నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు
శాశ్వత రాజు నా సహాయకుడు (2)
భారం నాకెందుకు వ్యాకులమెందుకు
ప్రభు ప్రజలతో నే కీర్తించెదన్ (2)          ||క్రైస్తవ||

బూర శబ్దంబు మ్రోగెడి వేళ
శ్రమ నొందిన నా ప్రభుని చూచెదన్ (2)
ఏనాడు ఎప్పుడు నీవు వచ్చెదవు
ఆనాటి వరకు నే కనిపెట్టెదన్ (2)          ||క్రైస్తవ||

English Lyrics

Audio

ఈ దినమెంతో శుభ దినము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఈ దినమెంతో శుభ దినము
నూతన జీవితం అతి మధురం
ఆగదు కాలం మన కోసం
గతించిపోయెను చెడు కాలం
వచ్చినది వసంత కాలం     ||ఈ దినమెంతో||

నీ హృదయం ఆశలమయము
కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2)
యేసుని కొరకై తెరచిన హృదయం
ఆలయం అది దేవుని నిలయం       ||ఈ దినమెంతో||

జీవితమే దేవుని వరము
తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2)
నూతన జీవము నింపుకొని
నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం      ||ఈ దినమెంతో||

English Lyrics

Audio

నీ జీవితం క్షణ భంగురం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ జీవితం క్షణ భంగురం
గమ్యంబులేని వేదనల వలయం (2)
నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం (2)
దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం          ||నీ జీవితం||

ఏది సత్యం ఏది నిత్యం – ఏది మాన్యం ఏది శూన్యం
సరి చూసుకో ఇప్పుడే – సరి చేసుకో (2)
ప్రభు యేసు నీ కొరకు బలి ఆయె కల్వరిలో
గమనించుమా ప్రియ నేస్తమా (2)          ||నీ జీవితం||

కష్టాలు ఎన్నైనా నష్టాలు ఎదురైనా
నీ సర్వ భారమంతా – యేసు పైన వేయుమా (2)
నీ హృదయ భారం తీరును ఈ క్షణం
దిగులు పడకుమా ప్రియ నేస్తమా (2)         ||నీ జీవితం||

English Lyrics

Audio

ఆరిపోయే దీపంలా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఆరిపోయే దీపంలా
ఆగిపోదా ఈ జీవితం (2)

మారలేని లోకమందు
మారలేవా జీవితాన (2)
మార్చుకో నీ జీవితం
చేర్చుకో ఆ దేవుని (2)
ఆ దేవుని (2)       ||ఆరిపోయే||

లోతు లేని లోకమందు
చూడలేవా చోటు కోసం (2)
చూడుమా ఆ దేవుని
వేడుమా ఆ దేవుని (2)
ఆ దేవుని (2)       ||ఆరిపోయే||

English Lyrics

Audio

ఈ జీవితం విలువైనది

పాట రచయిత: సత్యవేద సాగర్
Lyricist: Satyaveda Sagar

Telugu Lyrics

ఈ జీవితం విలువైనది
నరులారా రండని సెలవైనది (2)
సిద్ధపడినావా చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు           ||ఈ జీవితం||

సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2)
పోతున్నవారిని నువు చుచుటలేదా (2)
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2)    ||ఈ జీవితం||

మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2)
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2)
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2)    ||ఈ జీవితం||

పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2)
యేసు రక్తమే నీ పాపానికి మందు (2)
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2)    ||ఈ జీవితం||

English Lyrics

Audio

చూచితివే నా కన్నీటిని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


చూచితివే నా కన్నీటిని
తుడచితివే నా యేసయ్యా (2)
లొంగిపోయిన నా జీవితం
కృంగిపోయిన నా ఆత్మను (2)
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ          ||చూచితివే||

లోకమంతయూ నన్ను ద్వేషించినా
సొంత బంధువులంతా నన్ను వెలివేసినా (2)
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ          ||చూచితివే||

ఒంటరితనం నన్ను వేధించినా
దీన దరిద్రురాలై నన్ను అవమానించినా (2)
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ          ||చూచితివే||

ప్రేమతో నన్ను పిలిచావయ్యా
నీ వాక్కునిచ్చి స్వస్థపరచావయ్యా (2)
మరువలేనయ్యా నీ ప్రేమ
నేను… మరువలేనయ్యా నీ ప్రేమ (3)

English Lyrics

Audio

నా జీవితం ప్రభు నీకంకితం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా జీవితం ప్రభు నీకంకితం
నీ సేవకై నే అర్పింతును (2)

నీ మహిమను నేను అనుభవించుటకు
నను కలుగజేసియున్నావు దేవా (2)
నీ నామమును మహిమ పరచు
బ్రతుకు నాకనుగ్రహించు (2)           ||నా జీవితం||

కీర్తింతును నా దేవుని నే
ఉన్నంత కాలం (2)
తేజోమయా నా దైవమా
నీ కీర్తిని వర్ణించెద (2)           ||నా జీవితం||

English Lyrics

Audio

ఎవరితో నీ జీవితం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం
ఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు (2)

దేవుడే నీ జీవిత గమ్యం
దేవ రాజ్యం నీకే సొంతం
గురి తప్పక దరి చేరుమురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||

కష్టాలకు కృంగిపోకురా
నష్టాలకు కుమిలిపోకురా
అశాంతిని చేరనీకురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||

గెలుపోటమి సహజమురా
దివ్య శక్తితో కదులుమురా
ఘన దైవం తోడుండునురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||

English Lyrics

Audio

HOME