అడిగినది కొంతే అయినా

Telugu Lyrics

పాట రచయిత: క్రాంతి చేపూరి

అడిగినది కొంతే అయినా
పొందినది ఎంతో దేవా
ప్రతిగా ఏమివ్వగలనయా
నిను స్తుతియించే హృదయము తప్ప
నా జీవితం నీకే అంకితమయ్యా – (4)            ||అడిగినది||

ఊహించలేని వివరింపజాలని
నీ కార్యములు ఆశ్చర్యమే
యోచించినా నా వర్ణనకందని
నీ కృపా కనికరములు అత్యున్నతమే
తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా
యుగయుగములకు నీకే ఘనతా మహిమా
సతతం నిను నే కొనియాడెదను
సకలం నీ నామముకే స్తోత్రము తగును            ||అడిగినది||

క్షణ భంగురం నా క్షయ జీవితం
కాచావయ్యా నను నీ రెక్కల నీడ
ఏ యోగ్యత లేని అల్పురాల నన్ను
హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ
నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య
నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య
నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా
ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా                 ||అడిగినది||

మహిమోన్నతుడా నను మరువని విభుడా
ప్రణుతించెదను నిన్నే నిరతం
నిష్కలంకుడా నిర్మలాత్ముడా
ప్రకటించెదను నీ పావన చరితం
నా అతిశయము నీవే నా యేసయ్యా
నా ఆధారము నీవే నా మెస్సయ్యా
నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా
ఈ దీన సేవను చేకొనుమయ్యా          ||అడిగినది||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నన్నెంతగానో ప్రేమించిన

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా
నా దీన బ్రతుకునే దీవించిన దేవా (2)
నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును (2)
నా యవ్వనమంతా… నా జీవితమంతా (2)     ||నన్నెంతగానో||

ధరలోని మన్నుతో సమమైన నన్ను
ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు (2)
అన్నీ నీవే నాకై సమకూర్చినావు
ఉన్నాను నీ తోడు భయపడకన్నావు (2)
వాక్యపు మన్నాతో పోషించిన నన్నే
ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే    ||నిన్నే||

దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు
ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు (2)
మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు
చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు (2)
పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో
మరణపు విల్లును విరచిన దేవా నీలో      ||నీలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యవ్వనుడా

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


యవ్వనుడా యవ్వనుడా
మాటిమాటికి ఏల పడిపోవుచున్నావు?
యవ్వనుడా యవ్వనుడా
నీ పాపజీవితంలో ఇంక ఎన్నాళ్ళు సాగెదవు?       ||యవ్వనుడా||

దుష్టుడు శోధనలకు గురిచేయుచుండగా
వాక్యమనే ఖడ్గముతో తరిమికొట్టుము (2)
యేసయ్యను స్వీకరించి వెంబడించుము (2)
అపజయమే ఎరుగక సాగిపోవుము (2)          ||యవ్వనుడా||

అనుదినము వాక్యముతో సరిచేసుకొనుము
ఇతరులకొక మాదిరిగా జీవించుము (2)
పాపమనే చీకటిలో ఉన్నవారిని (2)
నీ సాక్ష్యముతో వెలుగులోకి నడిపించుము (2)       ||యవ్వనుడా||

యవ్వనుడా యవ్వనుడా
ఇప్పటికైనా… యేసు పాదాల చెంతకి రావా

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఇదిగో దేవా నా జీవితం

పాట రచయిత: వై బాబ్జి
Lyricist: Y Babji

Telugu Lyrics

ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం (4)                       ||ఇదిగో||

పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం        ||ఇదిగో||

నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము      ||ఇదిగో||

విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు (2)
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా         ||ఇదిగో||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME