ప్రార్థించుము

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ప్రార్థించుము నీ జీవితములో
నెమ్మది సుఖము లొందెదవు (2)
సంపూర్ణ భక్తిని కలిగించును
క్షేమములెన్నో పొందెదవు (2)        ||ప్రార్థించుము||

యెడతెగక నీవు ప్రార్థించినా
విసుగక నీవు ప్రార్థించినా (2)
సమస్తమును నీవు పొందెదవు
తప్పక న్యాయము పొందెదవు (2)
నీ కొరకై ప్రభు వేచియున్నాడు
ప్రార్థనలో కనిపెట్టుము (2)        ||ప్రార్థించుము||

కష్టము నష్టము కలిగినను
శోధన బాధలు వచ్చినను (2)
సాతాను నీపై విజృంభించి
నిన్ను గాయపరచినను (2)
భయపడకుము ప్రభువే నీకు
జయము నిచ్చును (2)        ||ప్రార్థించుము||

ప్రభువే మనతో సెలవిచ్చెను
మెళకువగా నుండి ప్రార్థించుమని (2)
విశ్వాసము కోల్పోయే దినములలో
విశ్వాసముతో ప్రార్థించినా (2)
సాతాను దుర్గములను పడగొట్టి
బలము పొందెదవు (2)        ||ప్రార్థించుము||

ప్రభువచ్చు వేళాయే గమనించుము
ఆత్మ వలన ప్రతి విషయములో (2)
ప్రార్థన విజ్ఞాపన చేయుచు
పూర్ణమైన పట్టుదలతో (2)
పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు
మెళకువగా నుండుడి (2)        ||ప్రార్థించుము||

యెరూషలేము క్షేమముకై
అన్యజనుల రక్షణకై (2)
భారముతో నీవు ప్రార్థించిన
ప్రభువే నీకు ఫలమిచ్చును (2)
వారి క్షేమమే నీ క్షేమమునకు
ఆధారమగును (2)        ||ప్రార్థించుము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీ జీవితములో

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా
ఈనాడే నీవు ప్రభు యేసుకొరకు నీ హృదయమర్పించవా (2)     ||నీ జీవితములో||

నీ తల్లి గర్భాన నీవుండినపుడే
నిను చూచే ప్రభు కన్నులు (2)
యోచించలేవా ఏ రీతి నిన్ను
నిర్మించే తన చేతులు (2)         ||నీ జీవితములో||

నీలోనే తాను నివసింపగోరి
దినమెల్ల చేజాచెను (2)
హృదయంపు తలుపు తెరువంగ లేవా
యేసు ప్రవేశింపను (2)         ||నీ జీవితములో||

తన చేతులందు రుధిరంపు ధారల్
స్రవియించే నీకోసమే (2)
భరియించె శిక్ష నీకోసమేగా
ఒకసారి గమనించావా (2)         ||నీ జీవితములో||

ప్రభు యేసు నిన్ను సంధించునట్టి
సమయంబు యీనాడేగా (2)
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరా
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరీ         ||నీ జీవితములో||

English Lyrics

Audio

Chords

పరమ జీవము నాకు నివ్వ

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొని పోవును

యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును

సాతాను శోధనలధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగినను
లోబడక నేను వెళ్ళెదను             ||యేసు||

పచ్చిక బయలులో పరుండజేయున్
శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్
మరణ లోయలో నన్ను కాపాడును           ||యేసు||

నరులెల్లరు నన్ను విడిచినను
శరీరము కుళ్ళి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము
విరోధివలె నన్ను విడచినను        ||యేసు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

నాకు నీ కృప చాలును

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నాకు నీ కృప చాలును ప్రియుడా (2)
నాకు నీ కృప చాలును
శ్రమలతో నిండిన ఈ జీవితములో (2)

నాథా నీ రాక ఆలస్యమైతే (2)
పడకుండ నిలబెట్టుము నన్ను
జారకుండ కాపాడుము (2)       ||నాకు||

పాము వలెను వివేకముగను
పావురమువలె నిష్కపటముగను (2)     ||నాథా||

జంట లేని పావురము వలెను
మూల్గుచుంటిని నిను చేరుటకై (2)      ||నాథా||

పాపిని నను కరుణించు దేవా
చేరి నిను నే స్తుతియించుచుంటిని (2)     ||నాథా||

English Lyrics

Audio

HOME