నన్ను దిద్దుము

పాట రచయిత: ముంగమూరి దేవదాసు
Lyricist: Mungamoori Devadasu

Telugu Lyrics


నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా
నీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా        ||నన్ను||

దూరమునకు బోయి నీ దరి – జేర నైతిని నాయనా
నేను కారు మూర్ఖపు పిల్లనై కా – రడవి దిరిగితి నాయనా            ||నన్ను||

మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ నాయనా
నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా            ||నన్ను||

చాల మారులు తప్పిపోతిని – మేలు గానక నాయనా
నా చాల మొరల నాలకించుము – జాలిగల నా నాయనా            ||నన్ను||

జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా
నీవు జ్ఞానము గల తండ్రి మంచు – జ్ఞప్తి వచ్చెను నాయనా            ||నన్ను||

కొద్ది నరుడను దిద్ది నను నీ – యొద్ద జేర్చుము నాయనా
నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము – మొద్దు నైతిని నాయనా            ||నన్ను||

ఎక్కడను నీవంటి మార్గము – నెరుగ నైతిని నాయనా
నీ రెక్క చాటున నన్ను జేర్చి – చక్కపరచుము నాయనా            ||నన్ను||

శత్రువగు సాతాను నన్ను – మిత్రు జేయను నాయనా
యెన్నో సూత్రములు గల్పించెను నా – నేత్రముల కో నాయనా            ||నన్ను||

వాసిగా నే బాప లోకపు – వాసుడ నో నాయనా
నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా            ||నన్ను||

English Lyrics

Audio

త్రాహిమాం క్రీస్తు నాథ

పాట రచయిత: పురుషోత్తము చౌదరి
Lyricist: Purushotthamu Chaudhary

Telugu Lyrics


త్రాహిమాం క్రీస్తు నాథ – దయ జూడ రావే
నేను – దేహి యనుచు నీ పాదములే
దిక్కుగా జేరితి నిపుడు          ||త్రాహిమాం||

గవ్వ చేయరాని చెడ్డ – కర్మేంద్రియాధీనుడనై
రవ్వ పాలై నేనెంతో – నెవ్వ బొందితి
త్రవ్వుచున్న కొలది – పెరుగు – దరగదు నా పాప రాశి
యివ్విధమున జెడిపోతిని నే – నేమి సేతు నోహోహోహో          ||త్రాహిమాం||

నీ యందు భయభక్తులు లేని – నిర్లజ్జా చిత్తము బూని
చేయరాని దుష్కర్మములు – చేసినాడను
దయ్యాల రాజు చేతిలో – జేయి వేసి వాని పనుల
జేయ సాగి నే నిబ్భంగి – జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో          ||త్రాహిమాం||

నిబ్బర మొక్కించుకైన – నిజము రవ్వంతైన లేక
దబ్బర లాడుతకు ము – త్తా నైతిని
అబ్బురమైన ఘోర పా – పాంధకార కూపమందు
దబ్బున బడిపోతి నయ్యో – దారి చెడి నేనబ్బబ్బబ్బా          ||త్రాహిమాం||

నిన్ను జేరి సాటిలేని – నిత్యానంద మంద బోవు
చున్నప్పుడు నిందలు నా – కెన్ని చేరినా
విన్నదనము లేకుండ నీ – వే నా మదికి ధైర్యమిచ్చి
యన్నిట రక్షించితివి నా – యన్న నీకు స్తోత్ర మహాహా          ||త్రాహిమాం||

English Lyrics

Audio

HOME